Home /News /business /

GOOD NEWS FOR RAILWAY PASSENGERS SOUTH CENTRAL RAILWAY INTRODUCES SCAN QR CODE OPTION FACILITY TO BUY TICKET AT ATVMS SS

Secunderabad Railway Station: ఈసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తే ఈ సర్వీస్ వాడుకోండి

ప్రయాణికుల సూచన మేరకు రైల్వే శాఖ 6 మార్చి 2020న మరో సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులో ఐదేళ్లలోపు పిల్లలకు సీట్లు బుక్ చేయాలని ఆదేశించింది. బుక్ చేసుకున్న సీటుకు సాధారణ ప్రయాణికుడి ధరతో సమానంగా ఉంటుంది. ఆ తరువాత దీనికి సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేయబడలేదు.

ప్రయాణికుల సూచన మేరకు రైల్వే శాఖ 6 మార్చి 2020న మరో సర్క్యులర్‌ను జారీ చేసింది. అందులో ఐదేళ్లలోపు పిల్లలకు సీట్లు బుక్ చేయాలని ఆదేశించింది. బుక్ చేసుకున్న సీటుకు సాధారణ ప్రయాణికుడి ధరతో సమానంగా ఉంటుంది. ఆ తరువాత దీనికి సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేయబడలేదు.

Secunderabad Railway Station | సొంతూరికి లేదా టూర్లకు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కొత్త సర్వీస్ ప్రారంభించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కేవారికి గుడ్ న్యూస్. ప్రయాణికులు స్వయంగా రైలు టికెట్స్ బుక్ (Train Ticket Booking) చేసుకోవడానికి గతంలోనే ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVMs) ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికులు రైల్వే కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా స్వయంగా టికెట్స్ బుక్ చేయొచ్చు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే క్యూఆర్ కోడ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే... రైల్వే ప్రయాణికులు ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ దగ్గర క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రైలు టికెట్స్ బుక్ చేయొచ్చు. మరి రైలు టికెట్స్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

ఏటీవీఎంలో రైలు టికెట్స్ బుక్ చేయండి ఇలా


Step 1- రైల్వే ప్రయాణికులు ఏటీవీఎం స్క్రీన్‌లో ఎక్కడికి వెళ్లాలో డెస్టినేషన్ ఎంటర్ చేయాలి.

Step 2- ఆ తర్వాత ట్రైన్ టైప్ సెలెక్ట్ చేయాలి.

Step 3- పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 4- స్కాన్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

Step 5- స్క్రీన్ పైన డిస్‌ప్లే అయిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.

Step 6- ఆ తర్వాత పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 7- ప్రయాణికులు ఫిజికల్ టికెట్ తీసుకోవచ్చు లేదా స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ చేయొచ్చు.

IRCTC QR Code: రైల్వే ప్రయాణికులకు అలర్ట్... క్యూఆర్ కోడ్ పేమెంట్ ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ


నాలుగు నెలల క్రితం పేటీఎం కూడా తమ ప్లాట్‌ఫామ్ ద్వారా పేమెంట్ చేసే సర్వీస్ ప్రారంభించింది. ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్‌లో టికెట్స్ తీసుకునే ప్రయాణికులు క్యాష్‌లెస్ పేమెంట్స్ చేసేలా ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే క్యూఆర్ కోడ్ పేమెంట్ ఆప్షన్ తీసుకొచ్చింది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈజీగా పేమెంట్స్ చేసి టికెట్స్ బుక్ చేయొచ్చు.

Axis Bank Credit Card: ఈ క్రెడిట్ కార్డుతో 53 లీటర్ల పెట్రోల్ ఉచితం అంటున్న యాక్సిస్ బ్యాంక్



సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనే కాదు దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ అందుబాటులో ఉన్నాయి. గతంలో రైలు టికెట్లు తీసుకోవడానికి రైల్వే టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలో నలబడాల్సి వచ్చేది. ఈ మెషీన్స్ సాయంతో ప్రయాణికులే స్వయంగా రైలు టికెట్లు బుక్ చేస్తున్నారు. ట్రైన్ టికెట్స్‌తో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్స్, సీజన్ టికెట్స్, స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ లాంటివన్నీ ఈ మెషీన్ల ద్వారా సాధ్యమే. ప్రయాణికులు యూపీఐ, వ్యాలెట్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: India Railways, IRCTC, Railways, Secunderabad railway station, South Central Railways

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు