భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు రైలు టికెట్ బుక్ చేయాలంటే రైల్వే కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లో ఐఆర్‌సీటీసీ ఏజెంట్ లేకపోయినా పర్వాలేదు. సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి రైలు టికెట్లు బుక్ (Train Ticket Booking) చేయొచ్చు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ఈ కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రయాణికులకు సేవల్ని మెరుగుపర్చేందుకు రైల్వే అనేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. రైల్వే ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని పెంచేందుకు రైల్వే అనేక కొత్త సేవల్ని ప్రారంభిస్తోంది.
అందులో భాగంగా పోస్ట్ ఆఫీసులో కూడా రైలు టికెట్లు బుక్ చేసే సదుపాయాన్ని కూడా తీసుకొస్తోంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నార్త్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో పలు కార్యక్రమాలను పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీసుల్లో రైల్వే టికెట్లు బుక్ చేయడంతో పాటు వైష్ణో దేవి, కామాఖ్య ఆలయానికి రెండు రైళ్లను కూడా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసే సౌకర్యాన్ని కూడా ప్రారంభిస్తారు.
Bullet Trains: హైదరాబాద్ నుంచి రెండు బుల్లెట్ రైళ్లు... రూట్స్ ఇవే
దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ సర్వీస్ ప్రయాణికులకు లభించనుంది. ఈ సర్వీస్ ద్వారా ప్రయాణికులు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా తమ ఊరిలో ఉన్న పోస్ట్ ఆఫీసులోనే టికెట్లు బుక్ చేయొచ్చని, ప్రయాణికులకు సమయం చాలా ఆదా అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్ల దగ్గర రద్దీ కూడా తగ్గుతుందన్నారు.
భారతదేశంలో 2020 మార్చి నాటికి 1,56,721 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఇది. ప్రతీ గ్రామానికి పోస్టల్ నెట్వర్క్ విస్తరించింది. కాబట్టి గ్రామాల వరకు ఏదైనా సేవల్ని విస్తరించాలనుకుంటే పోస్టల్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. ఈ నెట్వర్క్ ఉపయోగించుకొని రైల్వే సేవల్ని ప్రయాణికులకు అందించాలని భావిస్తోంది భారతీయ రైల్వే.
LIC Premium: ఈపీఎఫ్ఓ డబ్బులతో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించండి ఇలా
రైల్వే ప్రయాణాలు చేసేవారు రైలు టికెట్ తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్‌లో ఉన్న కౌంటర్‌లో రైలు టికెట్లు తీసుకోవచ్చు. రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ ఏజెంట్ల దగ్గరా రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకోవాలనుకుంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఉంది. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లో కూడా రైలు టికెట్లు బుక్ చేయొచ్చు.
ఐఆర్‌సీటీసీతో కలిసి కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా తమ యాప్స్ ద్వారా రైలు టికెట్ బుకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. పేటీఎం యాప్, ఇక్సిగో, మేక్‌మై ట్రిప్, గోఇబిబో లాంటి యాప్స్‌లో కూడా రైలు టికెట్స్ బుక్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India post, Indian Railways, IRCTC, Post office, Special Trains, Train tickets