Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త... లాక్‌డౌన్ తర్వాత ఈ సర్వీస్ మళ్లీ ప్రారంభం

Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త... లాక్‌డౌన్ తర్వాత ఈ సర్వీస్ మళ్లీ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్ తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది భారతీయ రైల్వే. మరి రిటైరింగ్ రూమ్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. గతేడాది మార్చిలో లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత రైల్వే సేవలు దశల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. మొదట కొన్ని స్పెషల్ ట్రైన్స్ మాత్రమే ప్రకటించిన రైల్వే ఆ తర్వాత రైళ్ల సంఖ్యను పెంచుతూ వస్తోంది. మరోవైపు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తోంది రైల్వే. యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో టికెట్ బుకింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో పాటు ఇటీవల రైళ్లల్లో ఇ-కేటరింగ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించేందుకు అనుమతిచ్చింది. ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్ సేవల్ని మొదలు పెట్టింది. ఇప్పుడు రిటైరింగ్ రూమ్స్, రైల్ యాత్రి నివాస్, హోటళ్లను తెరిచేందుకు భారతీయ రైల్వే అనుమతి ఇచ్చింది.

    గతేడాది లాక్‌డౌన్ కారణంగా ఈ సేవలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక పరిస్థితులు, ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్స్‌ని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్ తెరవడంపై నిర్ణయం తీసుకునే అధికారాలను జోనల్ రైల్వేస్‌కి అప్పగించింది భారతీయ రైల్వే. ప్రస్తుతం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్ రైల్వే సేవలు కూడా దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. రిటైరింగ్ రూమ్స్ తెరవాలన్న విజ్ఞప్తులు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి.

    Aarogya Setu App: ఆరోగ్య సేతు యాప్‌లో కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్... స్లాట్ బుక్ చేయండి ఇలా

    కాసేపట్లో Realme Narzo 30 Pro సేల్... ఇండియాలో చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే


    రిటైరింగ్ రూమ్స్, రైల్ యాత్రి నివాస్, హోటళ్లు తెరిచేందుకు భారతీయ రైల్వే అనుమతి ఇచ్చింది. వీటిని ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC నిర్వహిస్తోంది. రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్‌ను రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఏసీ, నాన్ ఏసీ సింగిల్, డబుల్, డార్మిటరీ లాంటి గదులు ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌లోనే బుక్ చేయొచ్చు. కనీసం 3 గంటల నుంచి గరిష్టంగా 48 గంటల వరకు రైల్వే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయడానికి ఈ కింద్ స్టెప్స్ ఫాలో కావాలి.

    IRCTC Tour: పూరీ, కోణార్క్ వెళ్తారా? ఐదు రోజుల టూర్ ప్యాకేజీ రూ.5,250 మాత్రమే

    IRCTC Tour: మేఘాలలో తేలుతూ మేఘాలయాకు హనీమూన్ టూర్... విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

    ముందుగా ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Retiring Room ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ పీఎన్ఆర్ నెంబర్‌లో సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ ఉంటాయి. మీరు రైలు ఎక్కడానికి ముందు రిటైరింగ్ రూమ్ బుక్ చేయాలంటే సోర్స్ స్టేషన్ ఎంచుకోవాలి. రైలు దిగిన తర్వాత రూమ్ కావాలంటే డెస్టినేషన్ స్టేషన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత చెక్ ఇన్ డేట్, చెక్ ఔట్ డేట్, బెడ్ టైప్, ఏసీ స్టేటస్, కోటా లాంటివి సెలెక్ట్ చేయాలి. చివరగా Check Availability పైన క్లిక్ చేయాలి. రూమ్ సెలెక్ట్ చేసి పేమెంట్ చేయాలి. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆఫ్‌లైన్‌లో రిటైరింగ్ రూమ్ బుక్ చేయాలనుకుంటే రైల్వే స్టేషన్‌లో ఎంక్వైరీ చేయాలి. రిటైరింగ్ రూమ్ బుక్ చేసే సమయంలో పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు మీ ట్రైన్ టికెట్ స్టేటస్‌ని వివరించాలి.

    భారతదేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, గద్వాల, కామారెడ్డి, కాజిపేట, నిజామాబాద్, రామగుండం, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఆదోని, అనంతపూర్, అన్నవరం, అరకు, చీరాల, కడప, చిత్తూరు, ఏలూరు, గుంతకల్, గుంటూరు, కర్నూలు టౌన్, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, పలాస, రేణిగుంట, సామర్లకోట, సూళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్, హోటల్స్ ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published: