చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో తరచూ ప్రయాణించేవారికి శుభవార్త. ఇకపై మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారిపోనుంది. త్వరలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎల్‌హెచ్‌బీ(లింక్ హాఫ్మన్ బుష్) కోచ్‌లతో అప్‌గ్రేడ్ చేయనుంది భారతీయ రైల్వే. రైలు నెంబర్ 12759/12760 చెన్నై సెంట్రల్-హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ మోడర్న్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. 12760 నెంబర్ రైలు నవంబర్ 4న, 12759 నెంబర్ రైలు నవంబర్ 5న ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ప్రయాణించనుంది. ప్రస్తుతం చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్-1, ఏసీ 2-టైర్ కోచ్‌లు-4, ఏసీ 3-టైర్ కోచ్‌లు-2, స్లీపర్ క్లాస్ కోచ్‌లు- 12, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-3, లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ కోచ్‌లు-2 ఉన్నాయి. నవంబర్ 4 నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్-1, ఏసీ 2-టైర్ కోచ్‌లు-3, ఏసీ 3-టైర్ కోచ్‌లు-4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు- 10, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-2, లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ కోచ్‌లు-2 ఉంటాయి.
లింక్ హాఫ్మన్ బుష్-LHB కోచ్‌లను భారతీయ రైల్వే మొదటిసారిగా 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. మొదటి దేశీయ LHB కోచ్ సేవలు 2003 లో మొదలయ్యాయి. జర్మన్ టెక్నాలజీతో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను రూపొందించారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ-ICF రూపొందించిన కోచ్లకన్నా ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయి. రైలు ప్రమాదం జరిగినప్పుడు ఒక కోచ్ పైకి మరో కోచ్ దూసుకెళ్లకుండా అడ్డుకునే యాంటీ-క్లైంబింగ్ ఫీచర్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లో ఉన్నాయి. ఫలితంగా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణనష్టం తక్కువగా ఉంటుంది. అంతేకాదు... ప్రయాణికులకు సీటింగ్ వ్యవస్థ చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ-ICF రూపొందించిన కోచ్‌ల తయారీని పూర్తిగా ఆపేసి పూర్తిగా లింక్ హాఫ్మన్ బుష్-LHB కోచ్‌లను మాత్రమే తయారు చేస్తున్నట్టు 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే భారతీయ రైల్వే ప్రకటించింది. అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.