రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే (Indian Railways) మరో శుభవార్త చెప్పింది. యూనివర్సల్ పాస్ ఉన్నవారు ఇక అన్రిజర్వ్డ్ టికెట్ల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. యూనివర్సల్ పాస్ (Universal Pass) ఉన్న రైల్వే ప్రయాణికులు అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ మొబైల్ యాప్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. రైల్వే ప్రయాణికులు అన్రిజర్వ్డ్ టికెట్స్‌ని యాప్‌లో కొనేందుకు భారతీయ రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్ (UTS on Mobile App) రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
అన్రిజర్వ్డ్ టికెట్స్‌ను ఆన్లైన్లో బుక్ చేయడానికి రైల్వే ప్రయాణికులు ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సల్ పాస్ ఉన్నవారు కూడా యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ ద్వారా రైలు టికెట్లు కొనే అవకాశం కల్పిస్తోంది. మరి టికెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.
ATM Charges Hike: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఇక కొత్త ఛార్జీలు చెల్లించాల్సిందే
Step 1- రైల్వే ప్రయాణికులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేయాలి.
Step 2- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ చేయాలి. మొదటిసారి ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే రిజిస్టర్ చేయాలి.
Step 3- లాగిన్ చేసిన తర్వాత ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. నార్మల్ బుకింగ్, క్విక్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ బుకింగ్, సీజన్ బుకింగ్, క్యూఆర్ బుకింగ్‌లో మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 4- మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారో స్టేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5- మీ యూనివర్సల్ పాస్‌ను యూటీఎస్ యాప్‌తో లింక్ చేయాలి.
Step 6- మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
Step 7- మీ RWALLET నుంచి ఛార్జీలు చెల్లించాలి.
Step 8- చివరగా పేమెంట్ పూర్తి చేసి టికెట్ కన్ఫామ్ చేయాలి.
Passengers having Universal Pass can now book their tickets through UTS Mobile App, without going to counter.
Follow the instructions mentioned to get your ticket. pic.twitter.com/yowx0iCioK
— Ministry of Railways (@RailMinIndia) November 30, 2021
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో భారతీయ రైల్వే గతేడాది మార్చిలో రైల్వే సేవల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశల వారీగా ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపింది. కొంతకాలం క్రితం అన్రిజర్వ్డ్ రైళ్లను కూడా ప్రారంభించడంతో యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో ప్రయాణికులు టికెట్లు బుక్ చేస్తున్నారు.
LIC Alert: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే ఈ వివరాలు అప్డేట్ చేయండి
రైల్వే ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లను ఎక్కువగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో బుక్ చేస్తుంటారు. కొద్ది మంది మాత్రమే రైల్వే రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లి టికెట్లు బుక్ చేస్తుంటారు. కానీ... అన్రిజర్వ్డ్ టికెట్ల కోసం రైల్వే కౌంటర్ల దగ్గరకు వెళ్లేవారే ఎక్కువ. అందుకే రైల్వే కౌంటర్ల దగ్గర రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రద్దీని తగ్గించడం కోసమే భారతీయ రైల్వే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌తో కలిసి యూటీఎస్ మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్స్ స్మార్ట్‌ఫోన్ ద్వారా బుక్ చేయొచ్చు. అయితే ఇప్పటికీ ఈ యాప్ ఉపయోగిస్తున్నవారు తక్కువే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways, IRCTC, Railways, Special Trains, Train, Train tickets, Travel