హోమ్ /వార్తలు /బిజినెస్ /

Railway Good News: రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే

Railway Good News: రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే

Railway Good News: రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Good News: రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన భారతీయ రైల్వే (ప్రతీకాత్మక చిత్రం)

Railway Good News | రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే (Indian Railways) శుభవార్త చెప్పింది. రైలు టికెట్లు బుక్ చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. యూటీఎస్ ఆన్ మొబైల్ (UTS ON MOBILE) యాప్‌లో రైలు టికెట్లు బుక్ చేసే వారికి ఊరట కల్పించింది. రైల్వే ప్రయాణికులు రైలు టికెట్లు బుక్ చేయడానికి విధించిన పరిధిని 20 కిలోమీటర్ల వరకు పెంచింది. నాన్ సబ్ అర్బన్ పరిధిలో 5 కిలోమీటర్లుగా ఉన్న పరిధిని 20 కిలోమీటర్లకు పెంచగా, సబ్ అర్బన్ ప్రాంతాల్లో 2 కిలోమీటర్లుగా ఉన్న పరిధిని 5 కిలోమీటర్లకు పెంచింది. రైల్వే ప్రయాణికులు అన్ రిజర్వ్‌డ్ రైలు టికెట్లను (Unreserved Train Tickets) యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో బుక్ చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. అయితే రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రైలు టికెట్లు యాప్‌లో బుక్ చేయొచ్చు.

యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ ఎలా పనిచేస్తుంది?

రైల్వే ప్రయాణికులు యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే రైల్వే స్టేషన్‌కు వెళ్లి, అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్ల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్‌లో రైలు టికెట్లు బుక్ చేసి, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్‌కు ఫోన్‌లో టికెట్ చూపిస్తే చాలు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) రూపొందించిన ఈ యాప్‌ను కోటి మందికి పైగా రైల్వే ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు తొలి వందే భారత్ రైలు... రూట్ ఇదే

ఉదాహరణకు ఓ రైల్వే ప్రయాణికుడు రైలులో సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లాలనుకుందాం. అతను ఐఆర్‌సీటీసీ యాప్‌లో స్లీపర్, ఏసీ కోచ్‌లల్లో ట్రైన్ టికెట్ ముందుగా బుక్ చేసుకుంటే ఆ టికెట్‌ను రిజర్వ్‌డ్ టికెట్ అంటారు. రిజర్వేషన్ కాకుండా రైల్వే కౌంటర్‌కు వెళ్లి జనరల్ బోగీలో ప్రయాణించడానికి టికెట్ తీసుకుంటే అది అన్‌రిజర్వ్‌డ్ టికెట్. రైలులో ఉండే అన్‌రిజర్వ్‌డ్ బోగీలో ప్రయాణించడానికి తీసుకునే టికెట్ ఇది. ఈ టికెట్లను యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో సులువుగా తీసుకోవచ్చు.

అయితే రిజర్వ్‌డ్ రైలు టికెట్లను ఎప్పుడైనా, ఎక్కడైనా బుక్ చేయొచ్చు. కానీ యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్లు బుక్ చేయడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా ఈ రైలు టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదు. రైలు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో ఉండి అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది.

IRCTC Konark Tour: కోణార్క్ ఫెస్టివల్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

గతంలో నాన్ సబ్ అర్బన్ పరిధిలోని ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు 5 కిలోమీటర్ల లోపు అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్లు బుక్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ పరిధిని 20 కిలోమీటర్లకు పెంచింది రైల్వే. అంటే రైల్వే స్టేషన్‌కు 20 కిలోమీటర్ల దూరం నుంచే ట్రైన్ టికెట్ బుక్ చేయొచ్చు. ఇక సబ్ అర్బన్ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో పరిధిని 5 కిలోమీటర్లకు పెంచింది. యూటీఎస్ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్ బుక్ చేయాలంటే ఫోన్‌లో జీపీఎస్ తప్పనిసరిగా ఆన్‌లో ఉండాలి.

యూటీఎస్ యాప్‌లో టికెట్లు బుక్ చేయండి ఇలా

Step 1- రైల్వే ప్రయాణికులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యూటీఎస్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 2- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ చేయాలి. మొదటిసారి ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే రిజిస్టర్ చేయాలి.

Step 3- లాగిన్ చేసిన తర్వాత ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. నార్మల్ బుకింగ్, క్విక్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ బుకింగ్, సీజన్ బుకింగ్, క్యూఆర్ బుకింగ్‌లో మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 4- ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారో స్టేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.

Step 5- పేమెంట్ పూర్తి చేస్తే టికెట్ బుక్ అవుతుంది.

First published:

Tags: Indian Railways, IRCTC, Railways, Train tickets

ఉత్తమ కథలు