• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • GOOD NEWS FOR PPF ACCOUNT HOLDERS NOW DEPOSIT MONEY ONLINE SS GH

PPF Account: పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్... డిజిటల్ పేమెంట్‌ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్

PPF Account: పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్... డిజిటల్ పేమెంట్‌ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

PPF Account | మీకు పీపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్-IPPB ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

  • Share this:
అన్ని వర్గాల ప్రజలకూ బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసేందుకు పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు పోస్టాఫీస్ ఖాతాదారులు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్-IPPB ద్వారా బేసిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌ను సులభంగా నిర్వహించుకోవచ్చు. IPPB ద్వారా అకౌంట్ బ్యాలెన్స్‌ చూసుకోవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్‌తో పాటు ఇతర ఆర్థిక లావాదేవీలను కూడా నిర్వహించవచ్చు. ఇంతకుముందు ఈ సేవల కోసం కస్టమర్లు పోస్టాఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వినియోగదారులు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు డిపాజిట్ చేయవచ్చు. రికరింగ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్, పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్ పథకాలకు యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ సేవలను కొనసాగించవచ్చు. పోస్ట్ ఆఫీస్ PPF అకౌంట్ హోల్డర్లు IPPB యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ PPF అకౌంట్‌కు డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు.

Aadhaar PVC Card: పాన్ కార్డ్ సైజులో ఆధార్ కార్డ్... సింపుల్‌గా ఆర్డర్ చేయండి ఇలా

LIC: ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్ మీకోసమే

IPPB ద్వారా పోస్టాఫీస్ PPF అకౌంట్‌కు వినియోగదారులు సులభంగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఇందుకు కస్టమర్లు ముందు బ్యాంక్ అకౌంట్‌ నుంచి IPPB అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలి. IPPB యాప్‌లో DOP సేవలను ఎంచుకుంటే.. కస్టమర్లకు అవసరమైన సేవలు కనిపిస్తాయి. రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్, రికరింగ్ డిపాజిట్‌లపై లోన్‌ తీసుకునేందుకు సంబంధించిన ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయి. PPF అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేసేందుకు ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పిపిఎఫ్ అకౌంట్ నంబర్, డిఓపి కస్టమర్ ఐడి నమోదు చేసి, డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి. అనంతరం 'పే' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. పేమెంట్ వివరాలు కస్టమర్లకు మెస్సేజ్, యాప్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.

SBI Home Loan 2021: ఎస్‌బీఐలో హోమ్ లోన్‌కు అప్లై చేస్తే అదిరిపోయే ఆఫర్

NPS Scheme: మీరు ప్రైవేట్ ఉద్యోగులా? ఈ స్కీమ్ మీకోసమే

ఆ సేవలు కూడా


పోస్టాఫీస్ అకౌంట్ హోల్డర్లు ఇండియా పోస్ట్ అందించే వివిధ పెట్టుబడి పథకాలను కూడా ఎంచుకోవచ్చు. వీటికి IPPB బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా క్రమం తప్పకుండా చెల్లింపులు చేయవచ్చు. యాప్‌ ద్వారా ఇతర బ్యాంక్ అకౌంట్‌ల నుంచి IPPBకి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీంతోపాటు IPPB మొబైల్ యాప్ ద్వారా RD, సుకన్య సమృద్ది అకౌంట్‌కు డబ్బు డిపాజిట్ చేయవచ్చు.

కొత్తగా వచ్చిన DakPay యాప్


కేంద్ర ప్రభుత్వం గత నెలలో DakPay డిజిటల్ పేమెంట్ యాప్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని పోస్టాఫీస్, IPPB కస్టమర్లు ఉపయోగించవచ్చు. ఈ యాప్‌ ద్వారా పోస్టల్ సేవలు, IPPB అందించే డిజిటల్ ఫైనాన్షియల్, అసిస్టెడ్ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు పొందవచ్చు. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం, డిజిటల్‌ విధానంలో చెల్లింపులు వంటి సేవలను DakPay సులభతరం చేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: