HOME »NEWS »BUSINESS »good news for post office account holders savings bank accounts will be interoperable with other banks by april ss gh

Post Office: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి మరో గుడ్ న్యూస్... ఇక క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్

Post Office: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి మరో గుడ్ న్యూస్... ఇక క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్
Post Office: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి మరో గుడ్ న్యూస్... ఇక క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్ (ప్రతీకాత్మక చిత్రం)

Post Office | మీకు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉందా? ఇక మనీ ట్రాన్స్‌ఫర్ ఈజీ కాబోతోంది. ఏప్రిల్ నాటికి కొత్త సర్వీస్ అందుబాటులోకి రానుంది.

  • Share this:
మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి దేశంలో ఎక్కడికైనా క్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యాన్ని ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది తపాలా శాఖ. దీనిలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(IPPB) ‘డాక్ పే’(DakPay) పేరుతో మొబైల్ డిజిట్ పేమెంట్ సర్వీసులకు అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్తో దేశవ్యాప్తంగా ఎక్కడి నుండైనా, ఎక్కడికైనా సులభంగా క్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇక, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌ను కూడా అన్ని ఇతర బ్యాంకుల వలే డిజిటలైజేషన్ చేయడంపై దృష్టి పెడుతనున్నామని తపాలా శాఖ తెలిపింది. 2021 ఏప్రిల్ నాటికి డాక్పే యాప్‌కు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను అనుసంధానం చేయనున్నట్లు పేర్కొంది.

కరోనా మహమ్మారి విజృంభనతో దేశంలో విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని రైలు, రోడ్డు, విమాన సర్వీసులు చాలా కాలం పాటు నిలిచివేయబడ్డాయి. ఈ సమయంలో ప్రజలకు అవసరమైన అత్యవసర సేవలను అందించడానికి, వస్తువులను పంపిణీ చేయడానికి పోస్టల్ విభాగం ముందు వరుసలో నిలిచి విస్తృత సేవలు అందించింది. లాక్డౌన్ సమయంలో సుమారు 85 లక్షల ట్రాన్సాక్షన్లను నిర్వహించి 900 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. అంతేకాక, తన పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా వైద్య పరికరాలను రవాణా చేసింది. మెడికల్ కిట్లు, వెంటిలేటర్లు, పిపిఈ కిట్లు, మందులు వంటి అత్యవసర సామాగ్రిని రవాణా చేసింది.



IRCTC: రైల్వే ప్రయాణికులకు న్యూ ఇయర్ గిఫ్ట్... ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కొత్త ఫీచర్స్

EPFO: ఈపీఎఫ్ వడ్డీపై కేంద్ర మంత్రి క్లారిటీ... వెంటనే బ్యాలెన్స్ చెక్ చేయండిలా

కరోనా కారణంగా ఇప్పటికీ రైళ్లు ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. దీంతో తమ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు పోస్టల్ శాఖ కార్యదర్శి ప్రదీప్తా కుమార్ బిసోయి అన్నారు. " 2021 ఏడాదిలో అన్ని పోస్టల్ సర్వీసులను డిజిటలైజ్ చేయడంపై, డోర్స్టెప్ డెలివరీలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఇప్పటికే మా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు చాలా వరకు డిజిటలైజ్ చేయబడ్డాయి. త్వరలోనే అన్ని రకాల సేవలను డిజిటలైజ్ చేయనున్నాం. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ కూడా ఏప్రిల్ నాటికి ఇతర బ్యాంకుల వలే నేరుగా పనిచేయగలదని మేము భావిస్తున్నాము. ” అని బిసోయి చెప్పారు. కాగా, పోస్ట్ ఆఫీస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (CBS) నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్గా నిలిచింది. ఈ నెట్‌వర్క్‌లో ఇప్పటికే 23,483 పోస్టాఫీసులు ఉన్నాయి.

Jio New Year Gift: యూజర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన జియో... ఏంటో తెలుసుకోండి

SBI: అలర్ట్... ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ కొత్త రూల్ అమల్లోకి వచ్చేసింది

డాక్పే ద్వారా విస్తృతంగా డిజిటల్ సేవలు


ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా 1.56 లక్షల పోస్టాఫీసులను కలిగి ఉంది. వీటి ద్వారా సుమారు 50 కోట్లకు పైగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (POSB) ఖాతా గల వినియోగదారులకు విస్తృత సేవలు అందిస్తుంది. 3 లక్షలకు పైగా సిబ్బందిని కలిగి ఉన్న తపాలా శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన డాక్ పే(DakPay) యాప్ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతుంది. దీనిలో భాగంగానే అన్ని POSB ఖాతాలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఖాతాలతో అనుసంధానించే ప్రక్రియను చేపట్టింది. తద్వారా ఇకపై DakPay మొబైల్ యాప్ ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల వలే యూపిఐ సేవలు, బిల్ చెల్లింపులు నిర్వహించవచ్చు. అంతేకాక, తపాలా శాఖ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్, పిపిఎఫ్, సుకన్య సంమృద్ధి యోజన అకౌంట్ వంటి ఖాతాలను కూడా నిర్వహించవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:January 02, 2021, 11:30 IST