Insurance Policy: ఎల్ఐసీతోపాటు ఇతర పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్

Moratorium on EMIs | పాలసీహోల్డర్లకు ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI శుభవార్త చెప్పింది.

news18-telugu
Updated: April 9, 2020, 11:21 AM IST
Insurance Policy: ఎల్ఐసీతోపాటు ఇతర పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్
Insurance Policy: ఎల్ఐసీతోపాటు ఇతర పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్
  • Share this:
మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC పాలసీ ఉందా? ఎల్ఐసీ పాలసీపై మీరు లోన్ తీసుకున్నారా? ఇతర పాలసీలపైన లోన్ తీసుకొని ఈఎంఐ చెల్లిస్తున్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇటీవల ప్రకటించిన మారటోరియం మీకు కూడా వర్తిస్తుంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణగ్రహీతలకు మూడు నెలల ఈఎంఐ మారటోరియం ఆప్షన్ ఇవ్వాలని ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ ఆదేశాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ కస్టమర్లకు ఈఎంఐలు వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించాయి. అయితే లోన్లు కేవలం బ్యాంకుల దగ్గర్నే కాదు... ఎల్ఐసీ లాంటి ఇన్స్యూరెన్స్ కంపెనీల దగ్గర తీసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఆయా ఇన్స్యూరెన్స్ కంపెనీలు పాలసీలపై రుణాలు ఇస్తుంటాయి. మరి ఆ లోన్ల సంగతి ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రంగంలోకి దిగింది. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా తమ కస్టమర్లకు మారటోరియం ఆప్షన్ ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

టర్మ్ లోన్లకు సంబంధించి ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈఎంఐలపై 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు మూడు నెలల మారటోరియం అనుమతించాలి. ఆ లోన్ల రీపేమెంట్‌ కోసం షెడ్యూల్, టెన్యూర్ లాంటివి మార్చాలి.

ఐఆర్‌డీఏఐ


ఎల్ఐసీతో పాటు ఇతర ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో పాలసీ తీసుకొని కొన్ని రోజులు పేమెంట్ చేసిన తర్వాత లోన్ పాలసీహోల్డర్లు రుణాలు తీసుకోవచ్చు. ఎక్కువగా ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు ఇలాంటి రుణాలు తీసుకుంటూ ఉంటారు. రుణం ఎంత వస్తుందనేది సరెండర్ వ్యాల్యూపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సరెండర్ వ్యాల్యూ రూ.10,00,000 అనుకుంటే పాలసీ హోల్డర్లు రూ.8,00,000 నుంచి రూ.9,00,000 మధ్య లోన్ తీసుకోవచ్చు ఈ రుణాలను నిర్ణీత గడువులో చెల్లిస్తూ ఉంటారు. ఈ రుణాలు తీసుకున్న పాలసీహోల్డర్లు ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. ఇప్పుడు వారు కూడా మారటోరియం ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

EMI moratorium: ఈఎంఐ వాయిదాకు అప్లై చేయండిలా...

Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే

Personal Loan: పర్సనల్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే...
Published by: Santhosh Kumar S
First published: April 9, 2020, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading