ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని (PM Kisan Scheme) రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ బేస్డ్ ఇకేవైసీ (OTP Based eKYC) మళ్లీ అందుబాటులోకి వచ్చింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇ-కేవైసీ కొంతకాలం పాటు తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. "ఓటీపీ ఆథెంటికేషన్‌తో ఆధార్ బేస్డ్ ఇకేవైసీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పీఎం కిసాన్ రైతులందరూ తప్పనిసరిగా ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి" అని వెబ్‌సైట్‌లో సమాచారం ఉండేది. కానీ... రైతుల కోసం ఇ-కేవైసీ అప్‌డేట్ చేసే అవకాశం మళ్లీ లభించింది. కాబట్టి రైతులు ఇంట్లో కూర్చొనే ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు ఆధార్ బేస్డ్ ఇ-కేవైసీ చేయించాలంటే ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసి ఉండాలి. ఓటీపీ బేస్డ్ ఇకేవైసీ ఇ-కేవైసీ ఎలా చేయాలో తెలుసుకోండి.
రైతులు ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో eKYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
మీ ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Get OTP ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఇ-కేవైసీ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
ఆ తర్వాత ఇక బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం రైతులు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి.
Post Office: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఉన్నారా? ఈ కొత్త రూల్ తెలుసా?
పీఎం కిసాన్ రైతులు ఆఫ్‌లైన్‌లో ఇ-కేవైసీ పూర్తి చేయొచ్చు. ఇందుకోసం రైతులు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ రైతులకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఇ-కేవైసీ అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ఇ-కేవైసీ అప్‌డేట్ చేయడానికి 2022 మే 31 చివరి తేదీ. అప్పట్లోగా రైతులు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే 11వ ఇన్‌స్టాల్‌మెంట్ లభించనుంది. ఇప్పటికే ఇకేవైసీ పూర్తి చేసిన రైతులు స్టేటస్ చెక్ చేయొచ్చు. స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.
ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేయాలి.
స్టేటస్‌లో ‘FTO is generated and Payment confirmation is pending’ అని కనిపిస్తే వెరిఫికేషన్ పూర్తైనట్టే.
SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ అలర్ట్... గైడ్‌లైన్స్ విడుదల చేసిన బ్యాంక్
రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతీ ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 సాయం లభిస్తోంది. ప్రతీ ఏటా ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి వాయిదా, ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య రెండో వాయిదా, డిసెంబర్ నుంచి మార్చి మధ్య మూడో వాయిదా అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ ఏడాది జూలైలోగా 11వ వాయిదాను విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, PM KISAN, PM Kisan Scheme, Pradhan Mantri Kisan Samman Nidhi