హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Life Certificate: పెన్షనర్లకు ఎస్​బీఐ గుడ్ న్యూస్... వీడియో కాల్​ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ సబ్​మిట్​ చేసే అవకాశం

SBI Life Certificate: పెన్షనర్లకు ఎస్​బీఐ గుడ్ న్యూస్... వీడియో కాల్​ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ సబ్​మిట్​ చేసే అవకాశం

SBI Life Certificate: పెన్షనర్లకు ఎస్​బీఐ గుడ్ న్యూస్... వీడియో కాల్​ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ సబ్మిట్​ చేసే అవకాశం
(image: SBI)

SBI Life Certificate: పెన్షనర్లకు ఎస్​బీఐ గుడ్ న్యూస్... వీడియో కాల్​ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ సబ్మిట్​ చేసే అవకాశం (image: SBI)

SBI Life Certificate | పెన్షనర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. వీడియో కాల్​ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ (Life Certificate) సబ్​మిట్​ చేసే అవకాశం కల్పిస్తోంది.

పెన్షన్​ పొందుతున్న వృద్ధులకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్​న్యూస్​ చెప్పింది. ఎస్​బీఐ మొట్ట మొదటిసారిగా ‘‘వీడియో లైఫ్ సర్టిఫికేట్’’ (వీఎల్​సీ) సర్వీసులను లాంచ్​ చేసింది. ఈ సర్వీసు కింద పింఛను దారులు వీడియో కాల్​ ద్వారా లైఫ్​ సర్టిఫికెట్​ను (Life Certificate) సబ్​మిట్​ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇవాల్టి (నవంబర్ 1) నుంచి ఈ కొత్త రకమైన సేవలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటివరకు పెన్షన్​ ద్వారా ఆదాయం పొందుతున్న వారు.. బ్యాంకులో గాని, పోస్టాఫీసులో గానీ, వారికి సంబంధించిన పెన్షన్​ ఆఫీస్​ నందు లేదా జీవన్​ ప్రమాణ్​ పోర్టల్​లో లైఫ్​ సర్టిఫికెట్​ చేసేవారు. కానీ, కరోనా కారణంగా నేరుగా బ్యాంకులకు వెళ్లి లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్​ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సబ్​మిట్​ చేయడానికి ఎస్​బీఐ అవకాశం కల్పిస్తోంది.

New Rules: నవంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే

దీనిపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ “ఇప్పుడు మీ లైఫ్​ సర్టిఫికెట్​ను మీ ఇంటి నుంచే సమర్పించండి! ఈ సర్వీసులు నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. పెన్షనర్లు తమ జీవన ధ్రువీకరణ పత్రాలను సాధారణ వీడియో కాల్ ద్వారా సమర్పించడానికి అనుమతిస్తుంది." అని #SBI #Pensioner #AzadiKaamritSCP అనే హ్యాష్​ట్యాగ్​ జోడించి ట్వీట్ చేసింది. అంతేకాదు, లైఫ్​ సర్టిఫికెట్​ను ఎలా సబ్​మిట్​ చేయాలనే దానిపై దాదాపు 1 నిమిషం నిడివి గల వీడియోను షేర్​ చేసింది.

Dhanteras 2021: ధంతేరాస్‌కు బంగారం కొంటారా? రూ.10,000 డిస్కౌంట్‌తో లభిస్తున్న గోల్డ్

వీడియో కాల్ ద్వారా లైఫ్​ సర్టిఫికెట్​ను సబ్​మిట్​ చేసే ప్రాసెస్​


Step 1- ఎస్​బీఐ పెన్షన్ సేవా పోర్టల్‌ని సందర్శించండి.

Step 2- లైఫ్​ సర్టిఫికెట్ సబ్​మిట్​​ ప్రాసెస్​ను ప్రారంభించడానికి 'వీడియో ఎల్​సీ'పై క్లిక్ చేయండి.

Step 3- మీ ఎస్​బీఐ పెన్షన్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్

Step 4- నంబర్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఎంటర్ చేయండి.

Step 5- ‘నిబంధనలు, షరతులు’ అంగీకరించి 'స్టార్ట్​ జర్నీ’పై క్లిక్ చేయండి.

Step 6- మీ ఒరిజినల్ పాన్ కార్డ్‌ని చేతిలో ఉంచుకుని, 'అయామ్​ రెడీ’పై క్లిక్ చేయండి.

Step 7- వీడియో కాల్ ప్రారంభించడానికి మీరు అనుమతి ఇచ్చిన తర్వాత, ఎస్​బీఐ అధికారి అందుబాటులోకి వస్తారు. తర్వాత, పెన్షన్​ సర్టిఫికెట్ సబ్​మిషన్​ ప్రాసెస్​ మొదలవుతుంది.

Step 8- వీడియో కాల్​లోకి వచ్చిన ఎస్​బీఐ అధికారి మీ స్క్రీన్​పై ఉన్న 4 అంకెల ధ్రువీకరణ కోడ్​ను చదవమని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఆ కోడ్​ చెప్పాల్సి ఉంటుంది.

Step 9- ఇప్పుడు మీ పాన్​ కార్డ్​ని బ్యాంక్​ అధికారికి చూపించి, దాన్ని ఫోటో తీసుకోవడానికి అనుమతించాలి. అనంతరం ఎస్​బీఐ అధికారి పాన్​ వివరాలను ధ్రువీకరిస్తారు.

ఇంతటితో మీ లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిషన్​ ప్రాసెస్​ పూర్తవుతుంది. ఏ కారణంతో అయినా మీ వీఎల్​సీ ప్రక్రియ తిరస్కరణకు గురైతే, బ్యాంకు ఎస్​ఎమ్​ఎస్​ ద్వారా మీకు తెలియజేస్తుంది. అప్పుడు ప్రత్నామ్నాయ పద్ధతులను అనుసరించి లైఫ్​​ సర్టిఫికెట్ సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది.

First published:

Tags: Pensioners, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు