Life Certificate: పీఎఫ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ .. ఇక ఆ సర్టిఫికట్ ఎక్కడినుంచైనా ఫైల్ చేయొచ్చు .. ఇదిగో ఇలా !

ఈపీఎఫ్‌వో(EPFO) ​​పెన్షనర్లు ఇకపై డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ (DLC) అందజేయడానికి ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. సంస్థ తాజాగా ప్రారంభించిన ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఎక్కడి నుంచైనా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను ఫైల్‌ చేయవచ్చు.

 • Trending Desk
 • | August 02, 2022, 14:00 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED 8 MONTHS AGO

  AUTO-REFRESH

  Highlights

  ఈపీఎఫ్‌వో (EPFO) ​​పెన్షనర్లు ఇకపై డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ (DLC) అందజేయడానికి ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. సంస్థ తాజాగా ప్రారంభించిన ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ(Technology) ద్వారా ఇప్పుడు ఎక్కడి నుంచైనా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను ఫైల్‌ చేయవచ్చు. ఇకపై లబ్ధిదారులు పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు శాఖలు లేదా సాధారణ సేవా కేంద్రాలకు వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ అందించాల్సిన శ్రమ దూరం అయింది. దీంతో దాదాపు 7.2 మిలియన్ల ఈపీఎఫ్‌వో ​​పెన్షనర్లpensioners)కు ప్రయోజనం కలగనుంది. పెన్షన్ సేవలు కొనసాగేందుకు ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

  వృద్ధులకు బయోమెట్రిక్‌ సమస్యలు

  వృద్ధాప్యం లేదా ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా బయోమెట్రిక్స్ (వేలిముద్ర లేదా కనుపాప) క్యాప్చర్ అవ్వక ఇబ్బందిని ఎదుర్కొంటున్న పెన్షనర్లకు కొత్త ఏర్పాట్లతో సమస్యలు దూరం కానున్నాయి. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ని ప్రొడ్యూస్‌ చేయడానికి బయోమెట్రిక్స్ తప్పనిసరి. ఈపీఎఫ్‌ఓ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.13,000 కోట్ల పెన్షన్‌ను అందజేసింది. కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న టెక్నాలజీ గురించి ఓ ఈపీఎఫ్‌వో అధికారి మాట్లాడుతూ..‘కొత్త విధానం ప్రకారం, ఒక పెన్షనర్ తన ఇంటి నుంచి లేదా మరే ఇతర ప్రదేశం నుంచి అయినా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌(DLC) ప్రొడ్యూస్‌ చేయవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ నుంచి ఒక నిర్దిష్ట యాప్‌ ఓపెన్‌ చేసి, సర్టిఫికేట్‌ను ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే.. పెన్షనర్‌ ఇంకా బతికే ఉన్నట్లు రుజువు అవుతుంది. ఇది పెన్షన్‌ను నిర్ధారిస్తుంది.’ అని తెలిపారు.

  విదేశాల్లో నివసిస్తున్న పెన్షనర్లు తమ డిజిటల్‌ లైఫ్ సర్టిఫికేట్‌ను ఇప్పుడు కొత్త విధానంలో సులువుగా సమర్పించవచ్చు.

  డాక్యుమెంట్స్ సమర్పించకపోతే పెన్షన్‌ కోత

  ఇప్పటివరకు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్, 1995 కింద పింఛను పొందుతున్న పింఛనుదారులందరూ పెన్షన్ మంజూరైన నెల నుంచి 12 నెలల తర్వాత బ్యాంక్ మేనేజర్ ధ్రువీకరించిన లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. పింఛను చెల్లిస్తున్న బ్యాంకుకు ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఒక సంవత్సరం తర్వాత లైఫ్ సర్టిఫికేట్ అందజేయకపోతే.. చివరిగా ధ్రువీకరణ పత్రం సమర్పించిన తేదీ నుంచి 12 నెలల తర్వాత పెన్షన్ నిలిచిపోతుంది.

  ఇదీ చదవండి: Indian Villages: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!


  ఫిజికల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ స్థానంలో, బయో-మెట్రిక్‌లను ఉపయోగించి 2015-16లో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌లను ప్రవేశపెట్టారు. అయితే చాలా సందర్భాలలో ఒకే వ్యక్తికి సంబంధించిన బయోమెట్రిక్‌లు కూడా సరిపోలడం లేదని గుర్తించారు. కాటరాక్ట్ సర్జరీ తర్వాత వేలిముద్ర సరిపోలకపోవడం లేదా ఐరిస్ సరిపోలకపోవడం దీనికి కారణం. ఫలితంగా, పెన్షనర్లు మళ్లీ గజిబిజిగా ఉన్న ఫిజికల్‌ సర్టిఫికేట్‌ ప్రక్రియను అనుసరించాల్సి వస్తోంది.

  మెరుగైన ఈపీఎఫ్‌వో సేవలు

  డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ కోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ప్రారంభించడం వల్ల బయోమెట్రిక్స్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెన్షనర్లకు మేలు జరుగుతుందని కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో ​​సేవలను మరింత మెరుగుపరిచేందుకు సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ ట్రస్టీస్‌ ప్రాథమిక ఆమోదం కూడా ఇచ్చిందని మంత్రి చెప్పారు.