హోమ్ /వార్తలు /బిజినెస్ /

Passport: ఇక పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల దరఖాస్తు

Passport: ఇక పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల దరఖాస్తు

Passport: ఇక పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల దరఖాస్తు
(ప్రతీకాత్మక చిత్రం)

Passport: ఇక పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల దరఖాస్తు (ప్రతీకాత్మక చిత్రం)

Passport | పాస్‌పోర్టు తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (Police Clearance Certificate) కోసం పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు అప్లై (Passport Application) చేశారా? పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (Police Clearance Certificate) కోసం తిప్పలు పడాల్సిన అసరం లేదు. ఈ సర్టిఫికెట్ పొందడం ఇక చాలా సులభం. పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లోనే (POPSKs) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం అప్లై చేయొచ్చు. సెప్టెంబర్ 28 నుంచే ఈ విధానం అమలులోకి వచ్చింది. పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే రెసిడెన్షియల్ అడ్రస్ ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. పాస్‌పోర్ట్ పొందడానికి దరఖాస్తుదారుల నేర రికార్డులను అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది.

ఎంప్లాయ్‌మెంట్ వీసా, లాంగ్‌టర్మ్ వీసా, నివాస ధృవీకరణ, విదేశాలకు వలస వెల్లడం లాంటి సందర్భాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. గతంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో లేదా భారత రాయబార కార్యాలయంలో అప్లై చేసే అవకాశం ఉండేది. విదేశాల్లో ఉన్నవారైతే హై కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. అయితే ప్రస్తుతం పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్ని మరింత సులభం చేసేందుకు పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసే అవకాశాన్ని కల్పిస్తోంది కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

TSRTC Holiday Tour: టీఎస్ఆర్‌టీసీ బంపరాఫర్... సెలవుల్లో 12 గంటల్లో హైదరాబాద్ చుట్టేయండి

పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉందని, ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఈ వెసులుబాటు కల్పిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పీపీసీ అపాయింట్‌మెంట్ స్లాట్లను కూడా పెంచుతామని ప్రకటించింది. పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ దరఖాస్తుల్ని స్వీకరించడం ద్వారా విదేశాలలో ఉపాధిని కోరుకునే భారత పౌరులతో, విద్య , లాంగ్ టర్మ్ వీసా, వలస లాంటి ఇతర అవసరాల కోసం ఉన్న డిమాండ్‌ను తీర్చవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

IRCTC Shirdi Tour: రూ.5,000 లోపే షిరిడీ, నాసిక్ టూర్ ... హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ

పౌరులకు పాస్‌పోర్ట్ సంబంధిత సేవల్ని అందించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ సంయుక్తంగా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం భారతదేశంలో 65 జిల్లాల్లో 428 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 20, తెలంగాణలో 14 జిల్లా కేంద్రాల్లో పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Passport, Post office

ఉత్తమ కథలు