Tatkal Booking: గుడ్ న్యూస్... ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ ప్రారంభం

Indian Railways Tatkal booking | లాక్‌డౌన్ కారణంగా భారతీయ రైల్వే నిలిపివేసిన తత్కాల్ టికెట్ బుకింగ్ మళ్లీ ప్రారంభించింది.

news18-telugu
Updated: June 29, 2020, 12:42 PM IST
Tatkal Booking: గుడ్ న్యూస్... ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ ప్రారంభం
Tatkal Booking: గుడ్ న్యూస్... ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే నడుపుతున్న అన్ని ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ ప్రారంభమైంది. జూన్ 1 నుంచి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ఐఆర్‌‌సీటీసీ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు తీసుకోవాల్సి ఉండేది. ఈ రైళ్లకు తత్కాల్ బుకింగ్ లేదు. జూన్ 29న తత్కాల్ బుకింగ్ ప్రారంభించింది రైల్వే. ఇక ఇప్పట్నుంచి ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుకింగ్ చేయొచ్చు. 200 ప్రత్యేక రైళ్లతో పాటు రాజధాని రైళ్లలో కూడా తత్కాల్ బుకింగ్ అందుబాటులో ఉంది. మరుసటి రోజు ప్రయాణించాలనుకునేవారు ఇవాళ తత్కాల్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏసీ రైళ్లకు ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ రైళ్లకు ఉదయం 11 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇక ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌ను 30 రోజుల నుంచి 120 రోజుల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆగస్ట్ 12 వరకు రెగ్యులర్ ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020 ఏప్రిల్ 14న లేదా అంతకన్నా ముందు బుక్ చేసిన రైలు టికెట్లను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ ఇస్తోంది.
First published: June 29, 2020, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading