Salary hike: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త... జీతాల పెంపు ఎంత శాతమంటే

Salary hike | భారతదేశంలో వేర్వేరు బ్యాంకుల్లో పనిచేస్తున్న 8.5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి.

news18-telugu
Updated: July 23, 2020, 2:51 PM IST
Salary hike: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త... జీతాల పెంపు ఎంత శాతమంటే
Salary hike: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త... జీతాల పెంపు ఎంత శాతమంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. జీతాలు పెరగబోతున్నాయి. 15 శాతం జీతాల పెంపును బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించాయి. దీంతో మూడేళ్ల ఉత్కంఠకు తెరపడింది. వార్షిక వేతనాన్ని 15 శాతం పెంచడంతో బ్యాంకులపై రూ.7,900 కోట్లు అదనంగా భారం పడనుంది. ఈ నిర్ణయం వల్ల 8.5 లక్షల మంది ఉద్యోగులు లాభపడనున్నారు. వేతనాల పెంపు 2017 నవంబర్ నుంచి అమలులోకి వస్తుంది. వేతనాల పెంపుపై యూనియన్లతో చర్చలు జరపాలని ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులతో కలిపి మొత్తం 37 బ్యాంకులు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను కోరిన సంగతి తెలిసిందే. బ్యాంకు యూనియన్లు పలు మార్లు సమ్మెకు దిగాయి. స్ట్రైక్ చేశాయి. సుమారు 35 సార్లు చర్చలు జరిగాయి. చివరకు ఈ చర్చలు కొలిక్కివచ్చాయి. ఈ చర్చల్లో 15 శాతం వేతనాల పెంపుపై ఒప్పందం కుదిరింది. బ్యాంకు యూనియన్లు, ఐబీఏ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Personal Loan: లోన్ ఈజీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి

PF withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఈ 3 తప్పనిసరి

వేతనాల పెంపుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు పర్ఫామెన్స్ లింక్డ్ ఇన్సెంటీవ్ కూడా అమలులోకి రానుంది. అంటే ఆ బ్యాంకు ఆపరేటింగ్ లేదా నెట్ ప్రాఫిట్‌ను పరిగణలోకి తీసుకొని పర్ఫామెన్స్ లింక్డ్ ఇన్సెంటీవ్ ఇస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పర్ఫామెన్స్ లింక్డ్ ఇన్సెంటీవ్ తప్పనిసరి కానుంది. ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులకు ఇది ఆప్షనల్. ఇక బేసిక్ పేను డీఏతో కలిపారు. కొత్త పెన్షన్ స్కీమ్‌ ఫండ్‌లోకి బ్యాంకుల కంట్రిబ్యూషన్ 10 శాతం నుంచి 14 శాతానికి పెరగనుంది.
Published by: Santhosh Kumar S
First published: July 23, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading