Home /News /business /

GOOD NEWS FOR NPS APY SUBSCRIBERS AND NOW CONTRIBUTE TO YOUR ACCOUNTS THROUGH UNIFIED PAYMENTS INTERFACE GH SRD

UPI Contributions: NPS, APY సబ్‌స్క్రైబర్స్‌కు గుడ్‌న్యూస్‌.. కాంట్రిబ్యూషన్ చెల్లించడం ఇక ఈజీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPI Contributions: సబ్‌స్రైబర్‌ల ప్రయోజనం కోసం D-Remit ద్వారా కాంట్రిబ్యూషన్‌లు డిపాజిట్ చేయడానికి UPI హ్యాండిల్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రారంభించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) సబ్‌స్క్రైబర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA). కాంట్రిబ్యూషన్‌లు సులభంగా చెల్లించేందుకు PFRDA కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పథకాలకు చెల్లించే కాంట్రిబ్యూషన్‌ను రియల్‌టైమ్‌ పేమెంట్‌ సిస్టమ్‌, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) ద్వారా చెల్లించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

సబ్‌స్రైబర్‌ల ప్రయోజనం కోసం D-Remit ద్వారా కాంట్రిబ్యూషన్‌లు డిపాజిట్ చేయడానికి UPI హ్యాండిల్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రారంభించింది. ప్రస్తుతం కాంట్రిబ్యూషన్‌లు IMPS/NEFT/RTGSని ఉపయోగించి లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తున్నారు. ఇది కాస్తంత సుదీర్ఘమైన ప్రక్రియ. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో పేమెంట్‌లు సులువుగా జరుగుతున్నాయి. కొంత కాలంలోనే యూపీఐ పేమెంట్స్‌ గణనీయంగా పెరిగాయి. అందుకే PFRDA ఈ సేవలను పెన్షన్‌ స్కీమ్‌ల సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

* 9.30 తర్వాత వచ్చిన కాంట్రిబ్యూషన్‌లు తర్వాత రోజు కింద లెక్క..
దీనికి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘ఇప్పుడు నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌, అటల్‌ పెన్షన్‌ యోజన సబ్‌స్క్రైబర్‌లు UPI ద్వారా కాంట్రిబ్యూషన్‌లు సులభంగా చెల్లించవచ్చు. D Remit కోసం UPI హ్యాండిల్ PFRDA.15digitVirtualAccount@axisbankని అందుబాటులోకి తీసుకొచ్చాం.’ అని తెలిపింది.

ఉదయం 9:30 గంటలకు ముందు వచ్చిన కాంట్రిబ్యూషన్‌లను అదే రోజు పెట్టుబడిగా పరిగణిస్తారని, ఆ తర్వాత వచ్చినవి మరుసటి రోజు పెట్టుబడిగా లెక్కిస్తారని PFRDA స్పష్టం చేసింది. PFRDA- నిర్వహిస్తున్న ఈ రెండు పథకాలు సంఘటిత, అసంఘటిత రంగ ఉద్యోగులు లక్ష్యంగా సేవలు అందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన టాప్ బ్యాంకులు.. లేటెస్ట్ ఎఫ్‌డీ రేట్లు ఇవే..

2003 డిసెంబర్‌లో నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. 2004 జనవరి 1 నుంచి సర్వీస్‌లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(సాయుధ దళాలు మినహా) NPSలో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం తప్పనిసరి. 2009 మే లో ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన ప్రైవేట్, అసంఘటిత రంగాలకు విస్తరించింది.

* UPI హ్యాండిల్ ద్వారా వర్చువల్ అకౌంట్‌ నంబర్‌ క్రియేట్‌ చేయడం, NPS కాంట్రిబ్యూషన్‌లు చెల్లించడం ఇలా..

- సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA-Central Recordkeeping Agency) సిస్టమ్‌లో eNPS వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

- పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నంబర్‌(PRAN-Permanent Retirement Account Number)ని వెరిఫై చేయడానికి వివరాలు ఎంటర్‌ చేయాలి.

- ఫోన్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, వర్చువల్ అకౌంట్‌ క్రియేట్‌ చేయాల్సిన అకౌంట్‌ను(టైర్ 1 లేదా II) సెలక్ట్‌ చేయండి

- తర్వాత జనరేట్‌ వర్చువల్‌ అకౌంట్‌(Generate Virtual Account) అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్‌ నంబరు కనిపిస్తుంది

- UPI హ్యాండిల్‌లో, ఫార్మాట్‌లో 15-అంకెల VANను ఎంటర్‌ చేయండి. ‘PFRDA.15digitVirtualAccount@axisbank’ అని టైప్ చేసి కాంట్రిబ్యూషన్‌లు చెల్లించండి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Atal Pension Yojana, NPS Scheme, Pensions, UPI, Upi payments

తదుపరి వార్తలు