• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • GOOD NEWS FOR NATIONAL PENSION SYSTEM SUBSCRIBERS CENTRAL GOVERNMENT ALLOWS PARTIAL WITHDRAWAL FROM NPS ACCOUNT SS

Personal Finance: మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ స్కీమ్‌లో ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు

Personal Finance: మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ స్కీమ్‌లో ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు

Personal Finance: మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ స్కీమ్‌లో ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

National Pension System | నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS స్కీమ్ సబ్‌స్క్రైబర్లకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఇచ్చింది.

 • Share this:
  మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA విత్‌డ్రా రూల్స్‌లో మార్పులు చేసింది. కరోనా వైరస్ మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ ఇల్‌నెస్‌గా గుర్తించడంతో నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS ఖాతాదారులు పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చని PFRDA తెలిపింది. అయితే మరీ అత్యవసరమైతే తప్ప ఈ స్కీమ్ నుంచి డబ్బులు డ్రా చేయొద్దని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తుంటారు. అయితే మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నట్టైతే, డబ్బు సమకూర్చుకోవడానికి ఇతర మార్గాలు లేకపోతే ఎన్‌పీఎస్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

  ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు ఈ స్కీమ్‌లో చేరిన మూడేళ్ల తర్వాత పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. అది కూడా జమ చేసిన మొత్తంలో 25 శాతానికి మించి విత్‌డ్రా చేయడం సాధ్యం కాదు. అంటే మూడేళ్లలో రూ.3,00,000 జమ చేస్తే అందులో రూ.75,000 మాత్రమే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎన్‌పీఎస్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న కాలంలో గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పాక్షికంగా విత్‌డ్రాయల్ చేయొచ్చు. కొత్త రూల్స్ ప్రకారం పాక్షికంగా విత్‌డ్రా చేసే మొత్తానికి పన్నులు ఉండవు. పిల్లల పైచదువులు, పెళ్లిళ్లు, కొత్త ఇల్లు కొనేందుకు, ఇల్లు నిర్మించుకునేందుకు, తీవ్రమైన అనారోగ్యాలకు చికిత్స కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేయొచ్చు. కరోనా వైరస్‌ని కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అనారోగ్యంగా గుర్తించినందుకు ఈ కారణంతో కూడా డబ్బులు తీసుకోవచ్చు.

  EPF Account: అలర్ట్... ఈపీఎఫ్ అకౌంట్‌లో ఈ వివరాలు సరిగ్గా లేకపోతే డబ్బులు రావు

  SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర సిద్ధంగా ఉన్నాయా?

  కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొదుపు పథకాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS పాపులర్ అయింది. ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకు జమ చేస్తే పన్ను మినహాయింపు లభిస్తుంది. అదనంగా రూ.50,000 వరకు ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో మొదట కనీసం రూ.500 జమ చేయాలి. ఆ తర్వాత ఏడాదికి కనీసం రూ.1,000 చొప్పున జమ చేయాలి. ప్రైవేట్ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ప్లానింగ్‌లో భాగంగా ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేయొచ్చు. ఇందులో 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డబ్బులు జమ చేయొచ్చు. పెన్షన్ కూడా లభిస్తుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏటా రూ.50,000 చొప్పున 30 ఏళ్ల పాటు ఈ స్కీమ్‌లో పొదుపు చేశాడనుకుందాం. 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.15,00,000 మాత్రమే. వడ్డీ ఏటా 10 శాతం లెక్కేస్తే కానీ 60 ఏళ్ల వయస్సు వచ్చేసరికి అకౌంట్‌లో రూ.90,00,000 పైనే ఉంటాయి. ఇది వడ్డీ రేటును బట్టి మారుతుంది.

  SBI Car Loan: ఈ కార్ ఇంటికి తీసుకెళ్లండి... డబ్బులు తర్వాత చెల్లించండి... ఎస్‌బీఐ 100 శాతం లోన్‌ ఆఫర్

  ATM: ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి కొత్త ఫీచర్... కార్డు, పిన్, ఓటీపీ అవసరం లేదు

  నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS స్కీమ్‌లో జమ చేసిన మొత్తంలో 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన 40 శాతం నుంచి ప్రతీ నెలా పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ రూ.15,000 పైనే ఉంటుంది. చివర్లో విత్‌డ్రా సమయంలో వచ్చే మొత్తం, ప్రతీ నెల లభించే పెన్షన్ ఇప్పుడు మీరు జమ చేసేదాన్ని బట్టి మారుతుంది.
  Published by:Santhosh Kumar S
  First published: