హోమ్ /వార్తలు /బిజినెస్ /

India Post: ఆ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ నుంచి కొత్త సర్వీస్

India Post: ఆ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ నుంచి కొత్త సర్వీస్

India Post: ఆ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ నుంచి కొత్త సర్వీస్
(ప్రతీకాత్మక చిత్రం)

India Post: ఆ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి పోస్ట్ ఆఫీస్ నుంచి కొత్త సర్వీస్ (ప్రతీకాత్మక చిత్రం)

India Post | ఇండియా పోస్ట్ అనేక పొదుపు పథకాలను, పెన్షన్ స్కీమ్స్‌ని (Pension Schemes) అందిస్తోంది. ఖాతాదారులు పోస్ట్ ఆఫీసుకి రావాల్సిన అవసరం లేకుండా ఓ పెన్షన్ పథకాన్ని ఆన్‌లైన్‌లో అందిస్తోంది.

నేషనల్ పెన్ష్ స్కీమ్‌లో (NPS) ఉన్నవారికి అలర్ట్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఎన్‌పీఎస్ సేవల్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించింది. పౌరులందరూ ఈ సేవల్ని పొందొచ్చని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ప్రకటించింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లోని లబ్ధిదారులు పోస్ట్ ఆఫీసుకి (Post Office) వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవల్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. 2010 నుంచి పథకం పోస్ట్ ఆఫీసుల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. లక్షలాది మంది ఖాతాదారులు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎన్‌పీఎస్ సర్వీసెస్ పొందుతున్నారు.

ఖాతాదారులు పోస్ట్ ఆఫీసుకి వెళ్లి ఈ పథకం సేవల్ని పొందాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేషనల్ పెన్ష్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ కస్టమర్లకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత పౌరులు ఎవరైనా ఆన్‌లైన్ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ సేవల్ని పొందొచ్చు. మరి ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో ఎన్‌పీఎస్ ఆన్‌లైన్ సేవలు ఎలా పొందాలో తెలుసుకోండి.

Post Office: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఉన్నారా? ఈ కొత్త రూల్ తెలుసా?

Step 1- ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో ఎడమవైపు ఉన్న మెనూలో NPS పైన క్లిక్ చేయాలి.

Step 3- National Pension System - Online Services పేజీ ఓపెన్ అవుతుంది.

Step 4- అందులో Online Services ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

Step 5- ఈ సెక్షన్‌లో Subscriber Registration & Initial Contribution, Subsequent Contribution, SIP Activation ఆప్షన్స్ ఉంటాయి.

Step 6- కొత్తగా ఈ స్కీమ్‌లో చేరాలనుకునేవారు లేదా ఇప్పటికే స్కీమ్‌లో ఉన్నవారు తమకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Investment: రూ.1,00,000 పెట్టుబడికి రూ.18 లక్షల రిటర్న్స్

కస్టమర్లు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో ఎన్‌పీఎస్ ఆన్‌లైన్ సేవల్ని ఉపయోగించుకోవడానికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారులు పోస్ట్ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే ఎన్‌పీఎస్ సేవలన్నీ లభిస్తాయి.

నేషనల్ పెన్షన్ స్కీమ్‌నే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని కూడా అంటారు. కేంద్ర ప్రభుత్వం అందించే పొదుపు పథకాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ పాపులర్ స్కీమ్. ఖాతాదారులు ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకు జమ చేసి ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. అదనంగా రూ.50,000 వరకు ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో మొదట కనీసం రూ.500 జమ చేయాలి. ఆ తర్వాత ఏడాదికి కనీసం రూ.1,000 చొప్పున జమ చేయాలి.

ప్రైవేట్ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ప్లానింగ్‌లో భాగంగా ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేయొచ్చు. ఇందులో 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డబ్బులు జమ చేయొచ్చు. పెన్షన్ కూడా లభిస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: India post, National Pension Scheme, Pension Scheme, Personal Finance, Post office, Post office scheme

ఉత్తమ కథలు