Home /News /business /

GOOD NEWS FOR MOTORISTS PETROL AND DIESEL PRICES ARE STABLE IF YOU ANT TO KNOW PRICES IN TELUGU STATES CLICK HERE PRV

Petrol and diesel rates Today: వాహనదారులకు ఊరట.. స్థిరంగానే పెట్రోల్, డీజిల్​ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

పెట్రోల్​, డీజిల్ ధరలు (Petrol, diesel rates) ఆకాశన్నంటుతున్నాయి. లీటర్​ పెట్రోల్​ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది.  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్​ పెట్రలో ధర రూ. 108.43గా ఉంది. అయితే మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. అక్కడక్కడ కొద్దిమేర మాత్రం పెరిగాయి.

ఇంకా చదవండి ...
గత కొద్దిరోజులుగా దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు (Petrol, diesel rates) ఆకాశన్నంటుతున్నాయి. లీటర్​ పెట్రోల్​ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది.  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్​ పెట్రలో ధర రూ. 108.43గా ఉంది. అయితే మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. అక్కడక్కడ కొద్దిమేర మాత్రం పెరిగాయి. మంగళవారం హైదరాబాద్​లో పెట్రోల్ (petrol) ధర లీటర్​కి రూ.106.51 గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర ఉంది. ఇక డీజిల్ (diesel) ధరరూ.99.04 గా ఉంది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.26 పైసలు తగ్గి రూ.106.21గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు తగ్గి రూ.98.75 గా ఉంది. వరంగల్‌ (Warangal)లో గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ ధర రూ.0.21 పైసలు తగ్గి రూ.106.03 గా ఉంది.

ఇక ప్రధాన నగరాల్లో పెట్రోల్​ ధరలు..

న్యూఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 102.39, ముంబై రూ. 108.43, చెన్నై రూ. 100.01, ,గుర్గావ్ రూ. 100.12, నోయిడా రూ. 99.70, బెంగళూరు రూ. 105.95 భువనేశ్వర్ రూ. 103.67 చండీగఢ్ రూ. 98.56, పాట్నా రూ. 105.30 గా ఉంది. త్రివేండ్రం రూ. 104.63 గా ఉంది.

తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు చూస్తే..

కరీంనగర్‌ (Karimnagar)లో పెట్రోల్ ధర రూ.106.39 గా ఉంది. డీజిల్ ధర రూ.98.92కు చేరింది. నిజామాబాద్‌లో పెట్రోల్ ధర రూ.107.76 గా ఉంది. డీజిల్ ధర రూ.100.20 గా ఉంది.

పెట్రోల్​ ధరలు పరిశీలిస్తే..

రంగారెడ్డి మంగళవారం లీటర్​ పెట్రోల్​ ధర రూ. 107  ఉండగా.. సోమవారం రూ. 106.51 గా ఉంది. సంగారెడ్డి లీటర్​ పెట్రోల్​ నేడు రూ. 106.73 ఉండగా, సోమవారం రూ. 106.94,  సిద్దిపేటలో నేడు లీటర్​ పెట్రలో రూ. 106.74, సోమవారం రూ. 106.66గా   ఉంది. సూర్యాపేటలో నేడు రూ. 106.33 ఉండగా , సోమవారం నాడు రూ. 105.97 ఉంది. వికారాబాద్లో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 107.81 ఉండగా, సోమవారం రూ. 108.04 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్​లో..

విశాఖపట్నంలో పెట్రోల్ (petrol) ధర ప్రస్తుతం రూ.107.60గా ఉంది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.100.42గా ఉంది. విజయవాడలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు  రూ.108. 87 గా ఉంది. డీజిల్ ధర రూ.100.83కు చేరింది.

గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 4 నాటి ధరల ప్రకారం 75.05 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Diesel price, Petrol prices, Petrol rate

తదుపరి వార్తలు