• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOOD NEWS FOR LPG CUSTOMERS GET CASH BACK UP TO RS 500 ON HP BHARAT GAS AND INDANE LPG CYLINDER BOOKINGS NK

LPG Cash Back Offer: గ్యాస్ సిలిండర్ బుక్ చెయ్యండి.. రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి

LPG Cash Back Offer: గ్యాస్ సిలిండర్ బుక్ చెయ్యండి.. రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి

గ్యాస్ సిలిండర్ బుక్ చెయ్యండి.. రూ.500 క్యాష్ బ్యాక్ పొందండి

Good News for LPG Customers: మీరు వంట గ్యాస్ బండ బుక్ చెయ్యాలనుకుంటున్నారా... ఐతే... ఇదే సరైన టైమ్ రూ.500 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి.

  • Share this:
    LPG Cylinder Booking, Paytm Cashback Offer: వంటగ్యాస్ వాడేవారికి రూ.500 క్యాష్ బ్యాక్ వస్తే అదిరిపోతుంది కదా. ఎల్పీజీ కంపెనీలు... కస్టమర్లను ఆకట్టుకోవడానికి అప్పుడప్పుడూ అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ఓ గ్యాస్ కంపెనీ... తన కస్టమర్లకు గ్యాస్ సిలిండర్‌పై రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ ఆఫర్ మీరు పొందేందుకు ఇదే సరైన టైమ్. పేటీఎం యాప్ (Paytm app) ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే... మీకు ఈ ఆఫర్ లభిస్తుంది. ఐతే... పేటీఎం ద్వారా మొదటిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి మాత్రమే ఇది లభించనుంది. మరి పేటీఎం యాప్ ద్వారా ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకుందాం.

    LPG Cashback: How to Avail the Benefit from Paytm App:
    ముందుగా మీ మొబైల్‌లో పేటీఎం యాప్‌ని ఓపెన్ చెయ్యండి. యాప్ ఓపెన్ చేశాక... మీకు హోమ్ స్క్రీన్‌పై బుక్ సిలిండర్ ('Book Cylinder') అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే... మీరు షో మోర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు బుక్ సిలిండర్ ఆప్షన్ క్లిక్ చెయ్యగానే... మీకు గ్యాస్ కంపెనీ పేరును సెలెక్ట్ చెయ్యమని కోరుతుంది. మీరు భారత్ గ్యాస్, ఇండేన్ గ్యాస్, HP గ్యాస్ ఏదైనా ఎంచుకోవాల్సి ఉంటుంది.

    ఆ తర్వాత... మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా LPG IDని ఎంటర్ చెయ్యమని కోరుతుంది. మీరు అది ఎంటర్ చేశాక... మీరు కస్టమర్ పేరు, lPG ID, ఏజెన్సీ పేరును స్క్రీన్ పై చూస్తారు. కింద గ్యాస్ సిలిండర్‌కి ఎంత చెల్లించాలో చూపిస్తారు. అది చూశాక మీరు ప్రాసెస్ పై క్లిక్ చెయ్యాల్సి ఉంటుంది. ఐతే... డబ్బు చెల్లించే ముందు... మీరు పేటీఎం గ్యాస్ బుకింగ్ ప్రోమోకోడ్ FIRSTLPG ను ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ కోడ్ ద్వారా... రూ.500 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తోంది.

    ఇది కూడా చదవండి:Gold Silver Prices Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు... కొనుక్కునే టైమ్

    మీరు ప్రోమో కోడ్ ఎంటర్ చెయ్యకపోతే... మీకు ఈ ఆఫర్ లభించదు. మరి ఇంకెందుకాలస్యం... ఇవాళే పేటీఎం యాప్ ద్వారా తొలిసారి గ్యాస్ బండ బుక్ చేయండి... క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు