Home /News /business /

GOOD NEWS FOR LIFE INSURANCE POLICY HOLDERS YOU MAY GET TAX BENEFITS MORE THAN ONE AND HALF LAKHS FULL DETAILS HERE PRN GH

Tax Deduction Benefit: లైఫ్ పాలసీ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో రూ.1.5 లక్షలకు పైగా మినహాయింపు పొందే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ (2022-23) ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ (Union Budget)పై జీవిత బీమా పాలసీదారుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ (2022-23) ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ (Union Budget)పై జీవిత బీమా పాలసీదారుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా క్లెయిమ్ చేసే సందర్భంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలకు పన్ను మినహాయింపు ప్రయోజనాల (tax deduction benefits)ను అందించే విషయంలో భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఒక ఏడాదిలో చెల్లించిన ప్రీమియంలపై మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ఆదాయ పన్ను చట్టం కింద ఒక ప్రత్యేక సెక్షన్‌ను ప్రవేశపెట్టడానికి బడ్జెట్ 2022 మార్గం సుగమం చేస్తుందని బీమా పరిశ్రమ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సెక్షన్ 80సీ కింద జీవిత బీమా ప్రీమియంలకు రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయి. అయితే ఈసారి బడ్జెట్ తో ఈ పన్ను మినహాయింపు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

“జీవిత బీమా అనేది ఒక దీర్ఘకాలిక పరిష్కారం. అయినప్పటికీ ఇది ఇతర షార్ట్ టర్మ్ ఆర్థిక ఉత్పత్తుల వలె 80సీ ప్రొవిజన్ కింద కవర్ అవుతోంది. ఐటీ డిడక్షన్ విభాగం (80సీ) కింద రూ. 1,50,000 మినహాయింపు లభిస్తోంది. జీవిత బీమా కోసం చెల్లించే ప్రీమియంలపై పన్ను మినహాయింపు కోసం ప్రత్యేక విభాగాన్ని రూపొందించడాన్ని బడ్జెట్ పరిశీలిస్తుందని మేం ఆశిస్తున్నాం. దీనివల్ల పాలసీదారులకు లబ్ధి చేకూరుతుంది,” అని ఎడెల్వీస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభ్రజిత్ ముఖోపాధ్యాయ అన్నారు. టర్మ్ ఉత్పత్తులపై ప్రస్తుత జీఎస్టీ రేటు 18% ఉండగా.. దాన్ని రేషనలైజేషన్ చేయడం ద్వారా జీవిత బీమా వంటి ప్రొటెక్షన్- ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ సరసమైన ధరకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఇది చదవండి: ఉద్యోగ మార్పపై 82శాతం భారతీయుల ఆశక్తి... తాజా సర్వేలో వెల్లడి.. కారణం ఇదే..!


జీవిత బీమా పాలసీని మూలధన ఆస్తిగా పరిగణించడం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) రాబోయే బడ్జెట్‌లో జీవిత బీమా పాలసీలకు సంబంధించి పలు సిఫార్సులు చేసింది. జీవిత బీమా పాలసీలను చట్టంలోని సెక్షన్ 2(14) కింద ఆస్తి నిర్వచనం పరిధిలోకి వచ్చే మూలధన ఆస్తి (capital asset)గా పరిగణించాలని ఐసీఏఐ సూచించింది. ప్రస్తుతం సెక్షన్ 10(10డీ) కింద మినహాయింపు ప్రీమియం నుంచి వాస్తవ మూలధన మొత్తం హామీ నిష్పత్తిపై ఆధారపడి ఉందని పేర్కొంది. దీనివల్ల వయస్సు, వృత్తిపరమైన/జీవనశైలి వ్యాధులు (రక్తపోటు, మధుమేహం మొదలైనవి) కారణంగా అధిక ప్రీమియంలతో కూడిన జీవిత బీమా పాలసీలు పన్ను పరిధిలోకి వస్తాయి. "ఇటువంటి సందర్భాలలో అధిక ప్రీమియంల కారణంగా బీమా పాలసీదారులు పన్ను మినహాయింపు పొందలేకపోతున్నారు" అని ఐసీఏఐ తన ప్రీ-బడ్జెట్ మెమోరాండమ్‌లో ఎత్తి చూపింది. మినహాయింపును ప్రీమియం, సమ్ అష్యూర్డ్ రేషియో ఆధారంగా నిర్ణయించకూడదని ఐసీఏఐ సూచించింది. బదులుగా, 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు మినహాయింపు ఇవ్వాలని ఐసీఏఐ అభిప్రాయపడింది.

ఇది చదవండి: వీళ్లు నిజమైన ప్రకృతి ప్రేమికులు... పక్షుల కోసం వినూత్న కార్యక్రమం..


ఇల్లు, వ్యక్తిగత, ప్రయాణ బీమా కోసం ప్రత్యేక మినహాయింపు
ప్రయాణ, వ్యక్తిగత లేదా గృహ బీమాకు సంబంధించిన చెల్లింపుల కోసం పాలసీదారులకు ప్రత్యేక మినహాయింపును అందుబాటులో ఉంచాలని కూడా ఐసీఏఐ సూచించింది. “ప్రస్తుతం ఎల్ఐపీ (LIP)కి చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు అందుబాటులో ఉంది. చట్టంలోని సెక్షన్ 80డీ కింద మినహాయింపు ఆరోగ్య బీమా ప్రీమియంలకు అందుబాటులో ఉంది. ప్రయాణ బీమా, గృహ బీమా లేదా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీకి సంబంధించిన చెల్లింపుల కోసం పాలసీదారులకు ప్రత్యేక మినహాయింపును అందుబాటులో ఉంచవచ్చని సూచించాం,” అని ఐసీఏఐ తెలిపింది.

ఇది చదవండి: ఫ్లైట్ లో తిరుపతికి వెళ్తున్నారా..? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..! శ్రమలేకుండానే శ్రీవారి దర్శనం..


టీడీఎస్ రేషనలైజేషన్
సెక్షన్ 194DA ప్రకారం టీడీఎస్ చెల్లింపు ప్రయోజనాల కోసం జీవిత బీమా పాలసీల ద్వారా వచ్చే "ఆదాయం" గణనను ప్రభుత్వం సులభతరం చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) సూచించింది. ఎఫ్ఐసీసీఐ (FICCI) తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో, సవరించిన సెక్షన్ 194DA పోస్ట్ ఫైనాన్స్ (నం.2) చట్టం 2019 ప్రకారం, ‘ఆదాయం(income)’ భాగంపై 5% టీడీఎస్ చేయాల్సి ఉంటుందని హైలైట్ చేసింది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:

Tags: Budget, Income tax, Life Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు