LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించలేదా? గుడ్ న్యూస్

LIC | వాస్తవానికి ఇలాంటి పాలసీలకు ప్రీమియం చెల్లించడానికి కొన్ని నెలలు మాత్రమే గడువు ఇస్తుంది ఎల్ఐసీ. పాలసీ ప్రీమియం చెల్లించకుండా ఆపేసినవాళ్లు తిరిగి ఆ పాలసీని యాక్టీవ్‌లో ఉంచాలంటే కొన్ని నెలల్లోనే ప్రీమియం కట్టాల్సి ఉండేది.

news18-telugu
Updated: November 4, 2019, 6:17 PM IST
LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించలేదా? గుడ్ న్యూస్
LIC: ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించలేదా? గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... పరిచయం అక్కర్లేని ప్రభుత్వ రంగ బీమా సంస్థ. మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటికి కనీసం ఒక ఎల్ఐసీ పాలసీ ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఎల్ఐసీ పాలసీ తీసుకున్నాక కొన్నేళ్లు ప్రీమియం సమయానికే చెల్లించడం, ఆ తర్వాత ప్రీమియం గురించి పట్టించుకోకపోవడం మామూలే. దీంతో ఎల్ఐసీ పాలసీలు ల్యాప్స్ అవుతుంటాయి. అలా ల్యాప్స్ అయిన పాలసీలను రెన్యువల్ చేసేందుకు అప్పుడప్పుడూ ఎల్ఐసీ రివైవల్ క్యాంపైన్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం రివైవల్ క్యాంపైన్ కొనసాగుతోంది. ఇప్పుడు మరో అవకాశం కల్పించింది ఎల్ఐసీ. 2014 జనవరి 1 తర్వాత ఎల్ఐసీ పాలసీలు తీసుకొని ప్రీమియంలు చెల్లించనివారంతా తమ నాన్-లింక్డ్ పాలసీలను ఐదేళ్లలో, యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్లలో రివైవ్ చేసుకోవచ్చు. అంటే ప్రీమియం చెల్లించకుండా రెండేళ్లు దాటిపోయినా ఆ పాలసీలను రివైవ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎల్ఐసీ.

వాస్తవానికి ఇలాంటి పాలసీలకు ప్రీమియం చెల్లించడానికి కొన్ని నెలలు మాత్రమే గడువు ఇస్తుంది ఎల్ఐసీ. పాలసీ ప్రీమియం చెల్లించకుండా ఆపేసినవాళ్లు తిరిగి ఆ పాలసీని యాక్టీవ్‌లో ఉంచాలంటే కొన్ని నెలల్లోనే ప్రీమియం కట్టాల్సి ఉండేది. ఐఆర్‌డీఏ ప్రొడక్ట్ రెగ్యులేషన్ 2013 ప్రకారం ఇలాంటి పాలసీలకు గరిష్టంగా రెండేళ్లు మాత్రమే పాలసీని రివైవ్ చేసుకునే అవకాశం ఉండేది. అంటే ప్రీమియం చెల్లించని నాటి నుంచి రెండేళ్ల తర్వాత పాలసీ పూర్తిగా ల్యాప్స్ అయిపోయినట్టే. రివైవ్ చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ అలాంటివారికి మరో అవకాశం కల్పిస్తోంది ఎల్ఐసీ. అది కూడా 2014 జనవరి 1 తర్వాత పాలసీలు తీసుకున్నవారికే ఈ అవకాశం. నాన్-లింక్డ్ పాలసీకి ఐదేళ్లు, యూనిట్ లింక్డ్ పాలసీకి మూడేళ్లలో రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. మరి మీరు కూడా 2014 జనవరి 1 తర్వాత పాలసీ తీసుకొని ప్రీమియం చెల్లించకుండా ఉంటే... ఇప్పుడు ప్రీమియం చెల్లించి పాలసీని యాక్టీవ్ చేసుకోవచ్చు.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డుపై ఇన్స్యూరెన్స్... ఎలా తీసుకోవాలో తెలుసుకోండి

PAN Card: పాన్ కార్డు లేదా? ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చుSBI: మీ ఏటీఎం లిమిట్ మీకు నచ్చినంత సెట్ చేయొచ్చు ఇలా...
Published by: Santhosh Kumar S
First published: November 4, 2019, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading