news18-telugu
Updated: November 3, 2020, 5:38 PM IST
Jan Dhan account: జన్ ధన్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్
(ప్రతీకాత్మక చిత్రం)
Jan Dhan Yojana Account: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు డబ్బులు డ్రా చేసుకున్నా, డిపాజిట్ చేసినా ఎలాంటి ఛార్జీలు వర్తించవని బ్యాంకులు స్పష్టతనిచ్చాయి. ఇటీవల కొన్ని బ్యాంకులు పరిమితికి మించిన డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కు ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న వార్తలొచ్చాయి. బ్యాంకులు పనిచేయని వేళలు, బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో క్యాష్ డిపాజిట్ మెషీన్లో డబ్బులు డిపాజిట్ చేస్తే కన్వీనెన్స్ ఫీజు వసూలు చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. నెలకు రూ.10,000 లోపు క్యాష్ డిపాజిట్ చేస్తే ఈ ఛార్జీలు వర్తించవు. ఒకే లావాదేవీలో లేదా పలు లావాదేవీల్లో నెలకు రూ.10,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే మాత్రం కన్వీనెన్స్ ఫీజు రూ.50 చెల్లించాలి. అయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్ హోల్డర్లు కూడా ఛార్జీలు చెల్లించాలన్న తప్పుడు ప్రచారం జరిగింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్లు ఉన్నవారితో పాటు సీనియర్ సిటిజన్లకు, అంధులకు, విద్యార్థులకు ఈ ఛార్జీలు వర్తించవని కూడా ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా-BOB, పంజాబ్ నేషనల్ బ్యాంక్-PNB లాంటి పెద్దపెద్ద బ్యాంకులు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాయి. ఈ బ్యాంకులేవీ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్ హోల్డర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయట్లేదని తెలిపాయి. ఖాతాదారులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మకూడదు. ఈ బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నియమనిబంధనల ప్రకారం ఛార్జీలను వసూలు చేయవు. అంతేకాదు... మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఈ అకౌంట్లకు ఛార్జీలు వర్తించవు.
Online Shopping Tips: ఆన్లైన్లో ఫెస్టివల్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే
Jio Balance: జియో బ్యాలెన్స్ సింపుల్‌గా చెక్ చేయండి ఇలా
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY అకౌంట్‌ను మోదీ ప్రభుత్వం 2014లో ప్రారంభించింది. నిరుపేదలకు కూడా బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంభమైంది. ఈ అకౌంట్‌ను 20 నుంచి 65 ఏళ్ల వయస్సు గల వారెవరైనా ఓపెన్ చేయొచ్చు. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటి ఐడీ, అడ్రస్ ప్రూఫ్స్ ఉంటే చాలు. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే ఖాతాదారులు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు ఉచితంగా బేసిక్ రూపే కార్డును జారీ చేస్తుంది బ్యాంకు. ఏ బ్యాంకు బ్రాంచ్ లేదా ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. డబ్బులు డిపాజిట్ చేయడానికి లిమిట్ లేదు. నెలకు నాలుగు సార్లు ఉచితంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు విత్‌డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాలి.
Published by:
Santhosh Kumar S
First published:
November 3, 2020, 1:22 PM IST