హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance Agents: ఇన్సూరెన్స్ ఏజెంట్లకు గుడ్ న్యూస్.. ఆ ప్రపోజల్‌పై వెనక్కి తగ్గిన IRDAI..

Insurance Agents: ఇన్సూరెన్స్ ఏజెంట్లకు గుడ్ న్యూస్.. ఆ ప్రపోజల్‌పై వెనక్కి తగ్గిన IRDAI..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Insurance Agents: ఇన్సూరెన్స్‌ ఏజెంట్లకు శుభవార్త. ఇక, ఇన్సూరెన్స్ ఏజెంట్లు దానిపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ ప్రపోజల్ పై వెనక్కి తగ్గింది IRDAI.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇన్సూరెన్స్‌ ఏజెంట్ల (Insurance Agents) కమీషన్‌పై ఇటీవల తీసుకొచ్చిన ప్రపోజనల్‌ను వెనక్కు తీసుకుంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI). ఏజెంట్లు కమీషన్ వివరాలను వెల్లడించాలనే నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవడంతో IRDAI వెనక్కి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇన్సూరెన్స్‌ కంపెనీలు పాలసీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు IRDAI చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే డీమెటీరియలైజేషన్‌, పాలసీ డాక్యుమెంట్లపై కమీషన్‌ను ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు బహిర్గతం (Disclosure) చేయాలని చెప్పింది.అయితే పాలసీ డాక్యుమెంట్లపై కమీషన్‌లను తప్పనిసరిగా బహిర్గతం చేయాలనే ప్రపోజల్‌పై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ ప్రపోజల్‌ను IRDAI వెనక్కి తీసుకుంది. కమీషన్‌ వివరాలను బహిర్గతం చేయడం వల్ల ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు నిరుత్సాహపడవచ్చని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ భావించిందని కొందరు ఉన్నతాధికారులు CNBC-TV18కి తెలిపారు.
ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు పాలసీ డాక్యుమెంట్‌పై కమీషన్‌ను తప్పనిసరిగా బహిర్గతం చేయాలనే ప్రపోజల్‌కు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) నుంచి, ఏజెంట్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతకుముందు, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఏజెంట్ల కమీషన్‌పై 20 శాతం పరిమితిని IRDAI ప్రపోజ్‌ చేసింది. కమిషన్ పరిమితిపై ముసాయిదా సంప్రదింపు పత్రాన్ని కూడా విడుదల చేసింది. ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు ఇన్సూరెన్స్‌ డిస్ట్రిబ్యూషన్‌కు ముఖ్యమని, ఐఆర్‌డీఏఐ కూడా ఇదే భావిస్తుందని అధికారులు తెలిపారు. వారిని నియంత్రించే ప్రపోజల్స్‌ ద్వారా బిజినెస్‌ ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు.


* వేగంగా మార్పులు
ఇంతకు ముందు ఇన్సూరెన్స్‌ కంపెనీలు చాలా వరకు ఫిజికల్‌ డాక్యుమెంట్ల ద్వారానే పని చేసేవి. కొత్తగా చేస్తున్న పాలసీలకు కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం నాటి పాలసీ డాక్యుమెంట్లు పేపర్ల రూపంలోనే ఉన్నాయి. వాటిలో ఏవైనా మార్పులు చేయాలంటే ఎక్కువ సమయం, శ్రమ అవసరం. మొత్తంగా చూస్తే ఖర్చు కూడా ఎక్కువ.
ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన యాక్సిస్ బ్యాంక్.. తాజా వడ్డీరేట్లు ఇవే..
దీంతో అన్ని ఫిజికల్‌ డాక్యుమెంట్లను డిజిటలైజ్‌ చేయాలని IRDAI నిర్ణయం తీసుకుంది. పాలసీ ఫిజికల్‌ డాక్యుమెంట్లను మాడిఫై చేసుకొనేలా డిజిటల్‌ డాక్యుమెంట్‌గా మార్చడాన్ని డీమెటీరియలైజేషన్ అంటారు. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నాయి. చాలా తక్కువ సమయంలో పాలసీలను పొందే సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
* 2023లోపు డీమెటీరియలైజ్‌ తప్పనిసరి
2022 డిసెంబరు నాటికి కొత్త ఇన్సూరెన్స్‌ పాలసీల డీమెటీరియలైజేషన్‌ను ఐఆర్‌డీఏఐ తప్పనిసరి చేసింది. 2023 డిసెంబర్ నాటికి ఇప్పటికే ఉన్న/పాత పాలసీలను డీమెటీరియలైజ్ చేయాలని ఇన్సూరెన్స్‌ కంపెనీలను కోరింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(CDSL) లేదా కార్వీ ద్వారా ఇన్సూరెన్స్‌ పాలసీలను డీమెటీరియలైజ్‌ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Insurance, Irdai, Personal Finance

ఉత్తమ కథలు