హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aon Survey: ఉద్యోగులకు అదిరే గుడ్ న్యూస్.. 2023లో జీతాలు భారీగా పెంపు!

Aon Survey: ఉద్యోగులకు అదిరే గుడ్ న్యూస్.. 2023లో జీతాలు భారీగా పెంపు!

Aon Survey: ఉద్యోగులకు అదిరే గుడ్ న్యూస్.. 2023లో జీతాలు భారీగా పెంపు!

Aon Survey: ఉద్యోగులకు అదిరే గుడ్ న్యూస్.. 2023లో జీతాలు భారీగా పెంపు!

Aon Survey: వేతన జీవులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచనున్నాయి. ఇండియన్ ఎంప్లాయీస్‌కు కంపెనీలు ఏకంగా డబుల్ డిజిట్ హైక్ ఇవ్వబోతున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వేతన జీవుల (Employees)కు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది కార్పొరేట్ కంపెనీలు (Corporate Companies) ఉద్యోగుల జీతాలను పెంచనున్నాయి. ఇండియన్ ఎంప్లాయీస్‌కు కంపెనీలు ఏకంగా డబుల్ డిజిట్ హైక్ (Double Digit Hike) ఇవ్వబోతున్నాయని వెల్లడించింది ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్మ్ అయాన్‌ పీఎల్‌సీ (Aon Plc). సంస్థ నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపింది. ఇండియాలోని 40 ఇండస్ట్రీలోని 1,300 కంపెనీలను సర్వే చేసిన అయాన్ సంస్థ.. ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

కార్పొరేట్ సంస్థల వ్యాపారం పెరుగుతున్న క్రమంలో ఉద్యోగుల వేతనాలు కూడా పెంచుతున్నారని సర్వే వివరించింది. ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి కొనసాగినా, దాని ప్రభావం వల్ల దేశీయ ద్రవ్యోల్బణంలో తేడాలు వచ్చినా, 2023లో ఉద్యోగుల వేతనాల పెరుగుదల డబుల్ డిజిట్ ఉంటుందని తెలిపారు అయాన్‌ సంస్థ హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ పార్ట్‌నర్ రూపాంక్ చౌదరి.

* జీతాల పెంపు ఎందుకు?

కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగుల రాజీనామాలు, ఉద్యోగ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు వేతనాలు పెంచుతున్నాయి. వచ్చే ఏడాది, అంటే 2023లో వేతనాలు 10.4 శాతం పెరగనున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి 9.9 శాతం పెరుగుదల అధికంగా ఉంది. 2022 ఫస్ట్ హాఫ్‌లో కార్పొరేట్ కంపెనీల అట్రిషన్ రేటు 20.3 శాతంగా ఉంది. ఈ ట్రెండ్ ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగనుంది సర్వే స్పష్టం చేసింది. 2021లో ఈ క్షీణత రేటు 21 శాతం ఉండగా ఈ ఏడాది తొలినాళ్లలో తక్కువగానే ఉంది.

* వారికి హయ్యెస్ట్ శాలరీస్

వచ్చే ఏడాదికి సంబంధించి ఐదు ప్రధాన రంగాల్లో నాలుగు రంగాల్లో అత్యధికంగా వేతనాలు పెంచే అవకాశాలున్నాయని అయాన్ సర్వే నిర్ధారించింది. అస్థిరతను తట్టుకుని కార్పొరేట్ సంస్థలు వ్యాపారాన్ని అద్భుతంగా చేశాయని సర్వే తేల్చింది. ఫలితంగా ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగుల వేతనం 12.8 శాతం, స్టార్టప్ కంపెనీల్లో 12.7 శాతం, హై-టెక్నాలజీ&ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసు రంగంలో 11.3 శాతం, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో 10.7 శాతం వరకు పెరుగుతుందని సర్వే స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి : అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి... వెంటనే ఇలా చేయండి

ఉద్యోగులకు అత్యధికంగా జీతాల పెంపు అస్థిరత వల్ల ఉంటుందని చెప్పారు అయాన్‌ సంస్థ హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ డైరెక్టర్ జంగ్ బహదూర్ సింగ్. మెరుగైన వ్యాపారం కొనసాగుతుండటంతో ప్రతిభ కలిగిన ఉద్యోగులను నిలుపుకునేందుకు ఆయా కంపెనీలు శాలరీలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని సర్వేలో వివరించారు.

* ప్రతిభ ఉన్న వారికి డిమాండ్

వర్క్‌ఫోర్స్ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలని కార్పొరేట్ సంస్థలు ప్రణాళికలు రచించుకుంటాయి. ఈ క్రమంలోనే తమ ఉద్యోగులను హోల్డ్ చేసుకొని ఉండేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటాయి. అందులో భాగంగానే తమ సంస్థ ఆర్థిక స్థితిగతులను సమీక్షించుకుని ప్రతిభ ఉన్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతాయి. మార్కెట్‌లో ప్రతిభ ఉన్న వారికి డిమాండ్ ఉన్న క్రమంలో తమ సంస్థలోని ప్రతిభ గల ఉద్యోగులను కోల్పోవడానికి ఆయా సంస్థలు ఇష్టపడబోవు. తమకు అవసరమైన వారిని హైర్ చేసుకోవడంతో పాటు ఉన్న వారికి రివార్డులు ఇచ్చి వారిని కొనసాగేలా చేస్తుంటాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Employees, Hike salary, Personal Finance

ఉత్తమ కథలు