ఇండేన్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నవారికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) శుభవార్త చెప్పింది. ఇండేన్ కాంబో డబుల్ బాటిల్ కనెక్షన్ (Indane Combo Double Bottle Connection) పేరుతో ఓ వెసులుబాటు కల్పిస్తోంది. సాధారణంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ 14.2 కిలోల బరువుతో ఉంటుంది. ఈ సిలిండర్ ఖాళీ అయ్యాక బుక్ చేస్తే కొత్త సిలిండర్ వస్తుంది. అయితే పాత సిలిండర్ ఖాళీ అయ్యాక, ఫుల్ సిలిండర్ రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయంలో ఇంట్లో వంట చేసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందుల్ని గుర్తించిన ఐఓసీఎల్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నవారు 5 కిలోల ఛోటు సిలిండర్ (5 KG Chhotu Cylinder) తీసుకునే వెసులుబాటు కల్పించింది.
ఇండేన్ కాంబో డబుల్ బాటిల్ కనెక్షన్ కింద ఇండేన్ కస్టమర్లు స్టాండ్ బైగా 5 కిలోల ఛోటు సిలిండర్ తెచ్చుకోవచ్చు. మామూలుగా ఈ సిలిండర్ తీసుకోవాలంటే ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇండేన్ గ్యాస్ కస్టమర్లు తమకు ఉన్న కనెక్షన్ పైనే ఛోటు సిలిండర్ తెచ్చుకోవచ్చు. అంటే 14.2 కిలోల సిలిండర్‌తో పాటు 5 కిలోల సిలిండర్ కూడా తీసుకోవచ్చు.
e Voter ID: ఇ-ఓటర్ ఐడీ... సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయండి ఇలా
The compact, 5 kg chhotu cylinder is the perfect solution when your bigger cylinder runs out. Thanks to Indane's Combo Double Bottle Connection, you can now avail a cylinder of your choosing to keep as a backup! pic.twitter.com/YvZPm9gku0
— Indian Oil Corp Ltd (@IndianOilcl) January 9, 2023
పెద్ద సిలిండర్ ఖాళీ అయిన తర్వాత ఫుల్ సిలిండర్ వచ్చే లోపు చిన్న సిలిండర్‌తో వంట పని ముగించేయవచ్చు. ఇంట్లో బ్యాకప్ సిలిండర్‌గా 5 కిలోల ఛోటు సిలిండర్ అందుబాటులో ఉంటుంది. ఫుల్ సిలిండర్ రావడం ఆలస్యమైనా ఇబ్బంది ఉండదు. వివిధ కారణాల వల్ల ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీలో జాప్యం జరిగితే, ఆ సమయంలో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న ఆలోచనతో ఐఓసీఎల్ ఈ వెసులుబాటు కల్పించింది.
ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 5 కిలోల ఛోటు సిలిండర్ కావాలనుకుంటే డబుల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇండేన్ డిస్ట్రిబ్యూటర్‌ను సంప్రదిస్తే ఎలా దరఖాస్తు చేయాలో వివరిస్తారు. 5 కిలోల ఛోటు సిలిండర్‌ను ఫ్రీ ట్రేడ్ సిలిండర్ అంటారు. బ్యాచిలర్స్, వలస కార్మికులకు ఎక్కువగా ఉపయోగపడే సిలిండర్ ఇది.
Salary Bonus: ఆ ఉద్యోగులకు బంపరాఫర్... 50 నెలల జీతం బోనస్
ఛోటు సిలిండర్‌ను ఎవరైనా తీసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. ఎక్కడైనా రీఫిల్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో గ్యాస్ తక్కువగా ఉపయోగించేవారికి కూడా ఛోటు సిలిండర్ ఉపయోగపడుతుంది. కేవలం ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి ఈ సిలిండర్ తీసుకోవచ్చు. పేపర్ వర్క్ కూడా ఎక్కువగా ఉండదు. ఇండియన్ ఆయిల్ రీటైల్ ఔట్‌లెట్స్, ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్, కిరాణా షాపుల్లో ఛోటు సిలిండర్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indane Gas, Indian Oil Corporation, LPG Cylinder, Lpg Cylinder Price