కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లు బాగా తగ్గించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు (Home Loan Interest Rates) గతంలో ఎన్నడూ లేనంత కిందకు దిగొచ్చాయి. బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. వడ్డీ రేట్లు ఏకంగా 7 శాతం లోపు దిగిరావడం విశేషం. ఇటీవల ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ (Repo Rate) పెంచినా ఇప్పటికీ 7 శాతం లోపు హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఉన్నాయి. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునేవారికి, ఫ్లాట్ కొనాలనుకునేవారికి, ఉన్న ఇంటిని బాగు చేయించాలనుకునేవారికి, హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
ప్రస్తుతం హోమ్ లోన్ తీసుకునేవారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు ప్రకటిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు అయితే ప్రాసెసింగ్ ఫీజును కూడా తొలగిస్తున్నాయి. Bank Bazaar అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం 7 శాతం లోపే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థల వివరాలు తెలుసుకోండి.
Pension Scheme: ఈ ప్రభుత్వ పథకంలో పొదుపు చేస్తే నెలకు రూ.1 లక్ష పెన్షన్... వివరాలు తెలుసుకోండి
బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ | హోమ్ లోన్ వడ్డీ రేటు |
యూకో బ్యాంక్ | 6.50 శాతం |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 6.65 శాతం |
బజాజ్ ఫిన్సర్వ్ | 6.70 శాతం |
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ | 6.75 శాతం |
ఐడీబీఐ బ్యాంక్ | 6.75 శాతం |
పీఎన్బీ హౌసింగ్ | 6.75 శాతం |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 6.80 శాతం |
సెంట్రల్ బ్యాంక్ | 6.85 శాతం |
బ్యాంక్ ఆఫ్ బరోడా | 6.90 శాతం |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 6.90 శాతం |
ఇండియన్ బ్యాంక్ | 6.90 శాతం |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 6.90 శాతం |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 6.90 శాతం |
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ | 6.90 శాతం |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 6.95 శాతం |
యాక్సిస్ బ్యాంక్ | 7 శాతం |
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ | 7 శాతం |
కొటక్ మహీంద్రా బ్యాంక్ | 7 శాతం |
Govt Scheme: జస్ట్ రూ.12 చెల్లించండి... రూ.2,00,000 ప్రయోజనం పొందండి
హోమ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల వివరాలు ఇవి. 2022 మే 13 నాటికి ఆయా బ్యాంకు వెబ్‌సైట్స్‌లో ఉన్న సమాచారాన్ని సేకరించి BankBazaar.com ఈ వివరాలు అందిస్తోంది. వడ్డీ రేట్లు తక్కువకే ప్రారంభం అవుతున్నాయి. అయితే వడ్డీ రేట్లు కస్టమర్ ఎంచుకున్న కాలవ్యవధిని బట్టి, క్రెడిట్ స్కోర్‌ను బట్టి మారుతుంది. ఫిక్స్డ్ వడ్డీ రేట్లు ఎంచుకుంటే నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత మారుతుంది. ఈ వడ్డీ రేట్లు కూడా నిర్ణీత కాలానికి మాత్రమే వర్తిస్తాయి. ఆ తర్వాత ఫ్లోటింగ్‌కు మారొచ్చు. కాబట్టి హోమ్ లోన్‌కు అప్లై చేయాలనుకునేవారు నియమనిబంధనలన్నీ తెలుసుకోవాలి. పూర్తి వివరాల కోసం సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌లో సంప్రదించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Home loan, Housing Loans, Personal Finance