HOME »NEWS »BUSINESS »good news for home loan customers state bank of india sbi gives option to opt new interest rates ss gh

SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ EMI తగ్గించుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన ఎస్‌బీఐ

SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ EMI తగ్గించుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన ఎస్‌బీఐ
SBI Home Loan: గుడ్ న్యూస్... హోమ్ లోన్ EMI తగ్గించుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన ఎస్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Home Loan | మీరు ఎస్‌బీఐలో హోమ్ లోన్ తీసుకున్నారా? అయితే మీ ఈఎంఐ తగ్గించుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. ఈఎంఐ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.

  • Share this:
    దేశంలో కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. దీంతో ఎస్బీఐ కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ప్రస్తుత గృహ రుణగ్రహీతలకు రెపో రేటుతో అనుసంధానించబడిన నూతన వడ్డీ రేటుకు మారడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం కస్టమర్ వన్ టైమ్ స్విచ్ఓవర్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాలి. ప్రస్తుత ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు 7% నుండి 7.35% పరిధిలో ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RBI రెపో రేటుతో ముడిపడి ఉంటాయి. మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రేట్లపై ఎస్బీఐ 0.05% ప్రత్యేక తగ్గింపును అందిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్బీఐ రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. దాని తరువాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు బాగా పడిపోయాయి. బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్(ఈబీఆర్)తో అనుసంధానించబడ్డాయి.

    SBI ATM: అలర్ట్... ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు కొత్త రూల్



    Savings Scheme: మీ డబ్బును రెండింతలు చేసే స్కీమ్ ఇదే

    రిటైల్ మరియు ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ రేట్లను ఈబీఆర్ రేటుతో అనుసంధానించాలని ఆర్‌బీఐ అన్ని షెడ్యూల్ చేసిన వాణిజ్య బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు చిన్న ఫైనాన్స్ బ్యాంకులను కోరింది. రుణగ్రహీతలకు గృహ రుణాలపై మూడు ప్రత్యేక ఆఫర్లను ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా లోన్ తీసుకుంటే మరో 0.05 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. అంతేకాక కొత్తగా తీసుకునే రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. రుణాల కోసం ఎంసిఎల్ఆర్ రీసెట్ ఫ్రీక్వెన్సీని ఎస్బిఐ ఒక సంవత్సరం నుండి ఆరు నెలలకు తగ్గించింది. ఒకవేళ గృహ రుణం ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేటుతో అనుసంధానించబడి ఉంటే, అప్పుడు గృహ రుణం రీసెట్ తేదీన మాత్రమే ఈఎంఐ మొత్తం మారుతుంది. ఉదాహరణకు, మీ గృహ రుణం రీసెట్ తేదీ ఆగస్టు మరియు ఫిబ్రవరిలో సవరించినట్లయితే, దాని ప్రభావం మీ EMI పై ఆగస్టులో మాత్రమే అనుభవించవచ్చు. ప్రస్తుతం, ఎస్బీఐ బ్యాంక్ యొక్క సంవత్సరం ఎంసిఎల్ఆర్ 7%, ఆరు నెలల ఎంసిఎల్ఆర్ 6.95% వద్ద ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published:September 16, 2020, 16:00 IST

    टॉप स्टोरीज