పండుగ సీజన్‌లో హోమ్ లోన్ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు పోటీపడుతున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్ (Home Loan) అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రద్దు వంటి రాయితీలు అందిస్తున్నాయి. అందువల్ల హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే లోన్ బదిలీ (Loan Switching) చేసుకొని వడ్డీ రేటు తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నవారికి కూడా ఇది గొప్ప అవకాశం. వాస్తవానికి గత ఏడాదిన్నరగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు (Home Loan Interest Rates) బాగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేట్లు 15 సంవత్సరాల కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి.
గడిచిన 18 నెలల కాలంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 115 పాయింట్లు అంటే 1.15 శాతం తగ్గించింది. దీన్ని ఆసరాగా తీసుకొని అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు రకరకాల ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు మళ్లీ పండుగ సీజన్ ప్రారంభమవుతుండటంతో అన్ని బ్యాంకులు మరోసారి ఆఫర్లు అందజేస్తున్నాయి.క్రెడిట్ స్కోర్ 800 పాయింట్లు అంత కంటే ఎక్కువ ఉంటే రుణమొత్తంతో సంబంధం లేకుండా 6.7శాతం వడ్డీకే గృహ రుణం ఇస్తామని ప్రకటించింది ఎస్‌బీఐ. అంతే కాదు నాన్-శాలరీడ్ శ్రేణికి ప్రాసెసింగ్ ఫీజు, వసూలు చేసే వడ్డీపై ప్రీమియం (15 పాయింట్లు) కూడా రద్దు చేసింది.
ESIC: ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ బెనిఫిట్ మీకోసమే
హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6.7 శాతం ప్రారంభ వడ్డీతో లోన్లు అందిస్తోంది. అక్టోబర్ 31, 2021 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. కొటక్ మహీంద్ర బ్యాంకు ఏకంగా 6.50 శాతం వడ్డీకే గృహ రుణాలు అందిస్తామని ప్రకటించింది. రుణగ్రహీత క్రెడిట్ ప్రొఫైల్, తీసుకునే రుణమొత్తాన్ని బట్టి ఇది ఉంటుంది. ఈ ప్రత్యేక ఆఫర్ రెండు నెలలు మాత్రమే ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేసి కొత్త రుణాలను 6.70 శాతానికే ఇస్తోంది.
Bank Holidays in October: అక్టోబర్‌లో 21 రోజులు బ్యాంకులు బంద్... దేశవ్యాప్తంగా హాలిడేస్ లిస్ట్ ఇదే
కొత్త రుణాలతో పాటు లోన్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఈ సంవత్సరం బ్యాంకులు దృష్టి సారించాయి సాధారణంగా బ్యాంకులు కొత్త కస్టమర్లకు తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు రీఫైనాన్సింగ్‌కు కూడా ఆఫర్లు వర్తింపజేస్తున్నాయి. కాబట్టి, ప్రస్తుత రుణగ్రహీతలు తమ వడ్డీ లెక్కించుకొని హోమ్ లోన్ మార్చుకోవచ్చు.
రుణం తీసుకున్న తొలి సంవత్సరాలలోనే తక్కువ వడ్డీ రేటు అందించే సంస్థలకు లోన్ స్విచింగ్ చేసుకోవడం వల్ల వడ్డీ భారం బాగా తగ్గుతుంది. అయితే దానికి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఫిక్స్డ్ లోన్ అయితే ఫోర్ క్లోజర్ ఛార్జీలు, కొత్త లోన్ ప్రాసెసింగ్ ఫీజ్, అప్లికేషన్ ఛార్జీలు, మార్టిగేజ్ డీజ్ ఫీజు, లీగల్ ఫీజు వంటివి మళ్లీ భరించాల్సి ఉంటుంది.
New Rules in October: అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే 6 కొత్త రూల్స్ ఇవే... తెలుసుకోండి
కాబట్టి వీటన్నింటినీ బేరీజు వేసుకొని మారడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీ ప్రస్తుత వడ్డీ రేటు కంటే కొత్త వడ్డీ రేటు 25-50 బేసిస్ పాయింట్లు తక్కువ ఉంటే నిక్షేపంగా మారిపోవచ్చు. అయితే దానికంటే ముందు మీ ప్రస్తుత బ్యాంకర్‌తో మాట్లాడటం ముఖ్యం. కనీసం సంవత్సరానికి ఒకసారైనా వారితో వడ్డీ తగ్గింపు గురించి సంప్రదించడం మంచిది. మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటే మీ రుణదాత వడ్డీ రేటు తగ్గించేందుకు అంగీకరించవచ్చు.
మీరు రూ.50 లక్షల హోమ్ లోన్ 7% వడ్డీతో 20 సంవత్సరాల వ్యవధికి తీసుకున్నట్టు భావిస్తే.. మీరు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.38,765 అవుతుంది. లోన్ బదిలీ ద్వారా వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్లు తగ్గితే.. మీ ఈఎంఐ వ్యవధి 240 నెలల నుంచి 229 నెలలకు తగ్గుతుంది. ఒకవేళ వడ్డీ రేటు అర శాతం తగ్గితే మీరు చెల్లించాల్సిన ఈఎంఐ వ్యవధి 222 నెలలవుతుంది. 7% వడ్డీ రేటుతో మీరు చెల్లించే వడ్డీ మొత్తం రూ.43.04 లక్షలు, అదే 6.7% వడ్డీ అయితే మీరు చెల్లించే వడ్డీ రూ.38.67 లక్షలు అవుతుంది. ఒకవేళ వడ్డీ రేటు 6.5% అయితే మీరు చెల్లించే వడ్డీ మొత్తం రూ.36.08 లక్షలు అవుతుంది. అయితే 7 శాతం వడ్డీతో లోన్ తీసుకున్నవాళ్లు తక్కువే. ఎక్కువగా 9 శాతం వడ్డీతో లోన్ తీసుకున్నవాళ్లు ఉంటారు. అలాంటివాళ్లు ఇప్పుడు వడ్డీ తగ్గించుకుంటే రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఆదా చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Bank loans, Home loan, House loan, Housing Loans, Personal Finance