• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • GOOD NEWS FOR HERO MOTOCORP CUSTOMERS COMPANY EXTENDS WARRANTY PERIOD FREE SERVICE DUE TO LOCKDOWN AK GH

Hero MotoCorp: కరోనా కష్టకాలంలో కస్టమర్లకు గుడ్​న్యూస్ చెప్పిన హీరో మోటోకార్ప్

ప్రతీకాత్మక చిత్రం

Hero MotoCorp: ఈ లాక్​డౌన్​ ప్రభావం ఆటోమొబైల్​ పరిశ్రమపై కూడా పడింది. దీంతో డీలర్​షిప్​ సెంటర్ల ద్వారా కస్టమర్లు సేవలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Share this:
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నందున దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్​డౌన్ విధిస్తున్నాయి. ఈ లాక్​డౌన్​ ప్రభావం ఆటోమొబైల్​ పరిశ్రమపై కూడా పడింది. దీంతో డీలర్​షిప్​ సెంటర్ల ద్వారా కస్టమర్లు సేవలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అనేక వెసులుబాట్లను కల్పిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన వినియోగదారులకు వారంటీ, ఉచిత సర్వీస్​ వ్యవధిని మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్​డౌన్ సమయంలో వారంటీ గడువు ముగిసే వాహనాలకు మరో 60 రోజుల పాటు ఉచిత సర్వీసులు అందిస్తామని తెలిపింది. ఈ ఫ్రీ సర్వీసులు, వారంటీ ప్రయోజనాలను జూలై 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే, ఈ వెసులుబాటు ఏప్రిల్ 1, మే 31 మధ్య గడువు ముగియనున్న వాహనాలకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కరోనా కాలంలో తమ కస్టమర్లకు ఫ్రీ సర్వీస్​, వారంటీ గడువు పొడిగించిన మూడో భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా హీరో మోటోకార్ఫ్​ నిలిచింది. అంతకుముందు, యమహా మోటార్ ఇండియా, హోండా మోటార్స్​ ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

జూన్​ 31 వరకు ఉచిత సర్వీస్​..
మరోవైపు, యమహా మోటార్ ఇండియా తన టూవీలర్స్​పై ఫ్రీ సర్వీస్​, వారంటీని జూన్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఇక, హీరో మోటోకార్ప్ సోమవారం నుంచి గురుగ్రామ్, హర్యానాలోని ధారుహేరా, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని మూడు ప్లాంట్లలో తన వాహనాల ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. కరోనా కారణంగా తన ఆరు హీరో మోటోకార్ప్ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి షట్​డౌన్​ విధించింది. ప్రారంభంలో ఏప్రిల్ 22 నుండి మే 2 వరకు విధించిన ఈ షెట్​డౌన్​ తర్వాత మే 16 వరకు పొడిగించింది. దీనిపై హీరో కంపెనీ ఒక ప్రకటనలో స్పందిస్తూ "మా కంపెనీ దేశంలో ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ పరిస్థితి మెరుగుపడిన వెంటనే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాం.” అని పేర్కొంది.
Published by:Ashok Kumar Bonepalli
First published: