• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOOD NEWS FOR HEALTH INSURANCE POLICY HOLDERS AFTER EIGHT YEAR MORATORIUM ALL CLAIMS TO BE PAID SAYS IRDAI SS

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్... ఐఆర్‌డీఏఐ కొత్త రూల్

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్... ఐఆర్‌డీఏఐ కొత్త రూల్

Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్... ఐఆర్‌డీఏఐ కొత్త రూల్ (ప్రతీకాత్మక చిత్రం)

Health Insurance Claims | హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నవారికి ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI గుడ్ న్యూస్ చెప్పింది.

  • Share this:
    మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నారా? ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. వరుసగా మీరు 8 ఏళ్లు ప్రీమియం చెల్లించినట్టైతే మీ క్లెయిమ్‌లను హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు సవాల్ చేయడానికి వీలు లేకుండా ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI కొత్త నిబంధనల్ని అమలులోకి తీసుకొచ్చింది. నష్టపరిహారాన్ని అందించే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీల్లో ఉన్న నియమనిబంధనల్ని ప్రామాణీకరించడమే ఈ మార్గదర్శకాల లక్ష్యం అని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న పాలసీలు ఈ గైడ్‌లైన్స్ పరిధిలోకి రాకపోయినా, 2021 ఏప్రిల్ 1 నుంచి రెన్యువల్ అయ్యే పాలసీలన్నీ ఈ గైడ్‌లైన్స్ పరిధిలోకి వస్తాయని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.

    హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ వరుసగా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆ పాలసీలపై క్లెయిమ్‌లను హెల్త్ ఆరోగ్య బీమా సంస్థలు సవాలు చేయడానికి వీల్లేదని, శాశ్వత మినహాయింపులు లేదా మోసాలు జరిగినట్టు నిరూపిస్తే తప్ప ఆ క్లెయిమ్‌ను సవాల్ చేయలేరని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఏదైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ క్లెయిమ్‌కు వచ్చినట్టైతే అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ స్వీకరించిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేస్తున్నారా? లేదా రిజెక్ట్ చేస్తున్నారా? అన్న విషయాన్ని కంపెనీ వెల్లడించాలి. క్లెయిమ్ సెటిల్ చేసి పేమెంట్ చేయడంలో ఆలస్యం జరిగినట్టైతే 2 శాతం వడ్డీతో పాలసీదారుడికి చెల్లించాలి.

    దీంతో పాటు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌డీఏఐ. మీరు మొబైల్ నెంబర్‌ను ఒక టెలికాం కంపెనీ నుంచి మరో టెలికాం కంపెనీకి మార్చినట్టు మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని కూడా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్చుకునే అవకాశం కల్పించబోతోంది. మీరు పాలసీ తీసుకున్న 45 రోజుల్లో మరో కంపెనీకి మార్చుకోవచ్చు. అంతేకాదు... హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నవాళ్లు ఎలాంటి లోపాలు లేకుండా కొనసాగిస్తే, వారికి కంటిన్యుటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయని తెలిపింది.

    ఇవి కూడా చదవండి:

    Aadhaar card: పిల్లలకు ఆధార్ కార్డు... ఈ విషయాలు గుర్తుంచుకోండి

    Business Idea: మహిళలకు గొప్ప అవకాశం... రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్

    SBI Account: ఇంటి నుంచే ఎస్‌బీఐ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు