యూపీఐ పేమెంట్స్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్‌లో (Bank Account) డబ్బులు ఉండాలి. కానీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ (UPI Payments) చేయొచ్చు. ఇందుకోసం మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (HDFC Credit Card) ఉంటే చాలు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ కస్టమర్లు తమ కార్డులతో ఇక యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఈ కొత్త సదుపాయం కల్పిస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (NPCI) కలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు భీమ్ యాప్, ఇతర యూపీఐ యాప్స్‌లో పేమెంట్స్ చేయొచ్చని ప్రకటించింది.
భారతదేశంలో రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ లావాదేవీలకు అనుమతి ఇచ్చిన మొట్టమొదటి ప్రైవేట్ రంగ బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అవతరించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌లు యూపీఐ ఐడీకి లింక్ చేయబడతాయని, తద్వారా సురక్షితమైన చెల్లింపు లావాదేవీలను చేయొచ్చని బ్యాంకు ప్రకటించింది.
Minimum Balance: బ్యాంక్ అకౌంట్ ఉందా? మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్, పెనాల్టీ ఛార్జీలు తెలుసా?
We’re pleased to announce that @HDFC_Bank customers can now link their Rupay #creditcard with the BHIM app and other UPI-enabled apps to enjoy enhanced payment experiences with #UPI. Read More: https://t.co/JVfWPpUXhu@RuPay_npci @upichalega @NPCI_BHIM #India pic.twitter.com/FKpSICjpHK
— NPCI (@NPCI_NPCI) February 16, 2023
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐ నెట్‌వర్క్‌కి అనుసంధానించడంతో, మా వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు చేయడానికి మరింత సౌలభ్యాన్ని అందించగలుగుతున్నామని, మారుతున్న మా కస్టమర్ల అవసరాలకు సరిపోయే ఎంపికను ఎంచుకునేలా మా నిరంతర ప్రయత్నం కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేమెంట్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ పరాగ్ రావ్ అన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్‌లు యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌లో తమ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించుకునే అవకాశం పెరుగుతుందని, క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్న వ్యాపారులు క్రెడిట్ కార్డ్ కస్టమర్ల నుంచి పేమెంట్స్ స్వీకరించవచ్చని కంపెనీ ప్రకటించింది.
Pre-Approved Loan: బ్యాంకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తోందా? ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ కస్టమర్లు యూపీఐలో చేరడం గేమ్-ఛేంజర్‌గా ఉంటుందని, వ్యాపారాల్లో యూపీఐ పేమెంట్స్ స్వీకరించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని, వినియోగదారులు UPIలో క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి క్యూఆర్ బేస్డ్, ఇ-కామర్స్ చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఓఓ ప్రవీణ రాయ్ అన్నారు.
ఇప్పటికే పలు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆ జాబితాలో చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BHIM UPI, Credit cards, Personal Finance, UPI, Upi payments