కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌సీటీసీ ఎయిర్ (IRCTC Air) ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక ఫేర్స్ వర్తిస్తాయని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) కింద బుక్ చేసే టికెట్లతో పాటు, ఇతర బుకింగ్స్‌కి ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫేర్ వర్తిస్తుందని ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ ఎయిర్ ప్లాట్‌ఫామ్‌లో సులువుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయొచ్చని సూచిస్తోంది. ఐఆర్‌సీటీసీ రైలు టికెట్ల బుకింగ్ (IRCTC Train Ticket Booking) కోసం https://www.irctc.co.in/ పోర్టల్ ప్రత్యేకంగా ఉన్నట్టే, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ కోసం http://air.irctc.co.in పోర్టల్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ క్లెయిమ్ చేసుకోవచ్చన్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రత్యేక నియమనిబంధనలు ఉన్నాయి. ఫ్లైట్ టికెట్ బుకింగ్ విషయానికి వస్తే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, బాల్మర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్, అశోక్ ట్రావెల్స్ అంట్ టూర్స్ బుకింగ్ ఏజెంట్స్‌గా ఉన్నాయి. ఎల్‌టీసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలనుకుంటే ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే చేయాలి.
Rs 1 Crore Returns: నెలకూ రూ.300 పొదుపుతో కోటీశ్వరులు కావొచ్చు ఇలా
If you are a govt. employee, #IRCTCAir brings you convenient flight booking options. #Book your #Flights now & avail special #Government #Employee fares including #LTC. For details, visit https://t.co/fLKvfBMuK7 or download the #IRCTC #AIR app now!@AmritMahotsav #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) February 28, 2023
ఎల్‌టీసీ ద్వారా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలోనే కొన్ని నియమనిబంధనల్ని ప్రకటించింది ప్రభుత్వం. ఉద్యోగులు తమకు వర్తించే ట్రావెల్ క్లాస్‌లో అందుబాటులో ఉండే ఉత్తమ ఛార్జీ ఉన్న విమానాన్ని ఎంచుకోవాలి. అంటే చౌకైన ధరతో అందుబాటులో ఉన్న నాన్-స్టాప్ ఫ్లైట్ సెలెక్ట్ చేయాలి. ఎల్‌టీసీ ద్వారా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే జర్నీ చేయబోయే తేదీ కంటే కనీసం 21 రోజుల ముందుగా విమాన టికెట్లను బుక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఐఆర్‌సీటీసీ ఎయిర్ ప్లాట్‌ఫామ్‌లో ఎల్‌టీసీ ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.
Two Weekoffs: ఆ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వీకాఫ్... త్వరలో నిర్ణయం తీసుకునే ఛాన్స్
ముందుగా http://air.irctc.co.in పోర్టల్ లేదా ఐఆర్‌సీటీసీ ఎయిర్ యాప్ ఓపెన్ చేయాలి.
లాగిన్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి, ఎల్‌టీసీ, డిఫెన్స్ ఫేర్ ఆప్షన్స్‌లో ఒకటి ఎంచుకోవాలి.
ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగి తమకు అర్హత ఉన్న క్లాస్‌లో తక్కువ ఫేర్ ఉన్న నాన్‌స్టాప్ ఫ్లైట్ సెలెక్ట్ చేయాలి.
వివరాలన్నీ సరిచూసుకొని పేమెంట్ పూర్తి చేయాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ లేదా ఉద్యోగి కోటాలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే ప్రయాణ సమయంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఈ కోటాలో సీట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగా బుక్ చేసుకున్నవారికి మాత్రమే టికెట్స్ కన్ఫామ్ అవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.