యూఎస్‌లో ఉన్న గూగుల్ పే యూజర్లకు శుభవార్త. మీరు ఇప్పుడు గూగుల్ పే ద్వారా ఇండియా, సింగపూర్‌లో ఉన్నవారికి సులభంగా డబ్బులు పంపించొచ్చు. ఆమాటకొస్తే ఇది ఇండియాలో ఉన్న యూజర్లకు కూడా శుభవార్తే. ఎందుకంటే మన దేశం నుండి చాలామంది యూఎస్‌లో ఉంటున్నారు. వారు ఇదివరకటి వరకు డబ్బులు పంపాలంటే పెద్ద ఝంఝాటమే ఉండేది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అక్కడి నుండి మీకు ఎవరైనా డబ్బులు పంపించొచ్చు. యూఎస్‌లో ఉన్న వినియోగదారులకు ఈ సౌకర్యం అందించడానికి వెస్ట్రన్ యూనియన్ , వైజ్ లాంటి సంస్థలతో గూగుల్‌పే జట్టుకట్టింది. గూగుల్ పేలోకి ఈ సర్వీసులు ఇంటిగ్రేట్ చేయడం వల్ల యూఎస్ నుండి మన దేశానికి డబ్బులు పంపడం వీలవుతోంది. చరిత్రలో ఇలాంటి ఏర్పాటు ఇదే తొలిసారి. ఈ క్రమంలో మరికొన్ని దేశాలకు ఈ ఫీచర్‌ను తీసుకెళ్లాలని చూస్తోంది. వెస్ట్రన్ యూనియన్‌తో కుదిరిన ఈ పార్టనర్షిప్ ద్వారా గూగుల్ పే క్రాస్‌బోర్డర్ సర్వీసును 200 దేశాలకు విస్తరించాలని గూగుల్ పే నిర్ణయించింది. అదే సమయంలో వైజ్‌తో కలసి 80 దేశాలకు సేవలను విస్తరించనుంది.
Aadhaar Card: ఆధార్ నెంబర్ ఒక్క ఎస్ఎంఎస్తో లాక్ చేయండి ఇలా
Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే
యూఎస్‌లో డబ్బులు పంపేవాళ్లు... పేమెంట్ చేసేటప్పుడు ఏ సర్వీసు ద్వారా డబ్బులు వెళ్లాలి అని గూగుల్ పే అడుగుతుంది. అంటే వెస్ట్రన్ యూనియన్ నుండి వెళ్లాలా, లేక వైజ్ నుండి వెళ్లాలా అనేది కోరుకోమంటుంది. డబ్బులు పంపాక వచ్చే రిసిప్ట్‌లో ఈ వివరాలను పొందుపరుస్తారు. దాని వల్ల తర్వాత ఎప్పుడైనా ట్రాక్ చేయాలంటే ఉపయోగపడుతుంది. మరోవైపు భద్రత విషయంలోనూ గూగుల్ పటిష్ఠ చర్చలు చేపట్టాలని చూస్తోంది. దీని కోసం టూస్టెప్ వెరిఫికేషన్‌ను వినియోగదారులందరికీ మాండేటరీ చేయాలని చూస్తోంది.
గూగుల్ పే నుండి వెస్ట్రన్ యూనియన్ ద్వారా డబ్బులు పంపిస్తే ఎలాంటి అదనపు రుసుము, ట్రాన్స్ఫర్ ఫీజులు ఏమీ ఉండవు. అయితే వైజ్ నుండి డబ్బులు పంపిస్తే ఫారిన్ ఎక్స్ఛేంజ రేటు, ట్రాన్స్ఫర్ ఫీజు వసూలు చేస్తారు. అయితే ఇది ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటుంది. ఇక గూగుల్ పే విషయానికొస్తే జూన్ 16 వరకు డబ్బులు ట్రాన్స్ఫర్కి ఎలాంటి రుసుము వసూలు చేయదు. వైజ్ అయితే తొలి ట్రాన్స్‌ఫర్‌కు (500 డాలర్ల వరకు) ఉచిత సేవలు అందించాలని నిర్ణయించింది.
Realme 8 5G: మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తే రూ.549 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్
LIC Claims: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా?
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం... గూగుల్ పే ద్వారా 2019లో మన దేశానికి అత్యధికంగా 80 బిలియన్ డాలర్లు వచ్చాయి. అదే సమయంలో అత్యధికంగా పంపిన దేశం అమెరికా కావడం విశేషం. వెస్ట్రన్ యూనియన్, వైజ్‌తో కుదిరిన ఈ ఒప్పందం వల్ల పేపాల్ లాంటి పేమెంట్ సర్వీసులకు గట్టి పోటీ ఇవ్వాలని గూగుల్ పే చూస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google pay, India, Money Transfer, Personal Finance, USA