GOOD NEWS FOR ESIC SUBSCRIBERS ATAL BIMIT VYAKTI KALYAN YOJANA SCHEME EXTENDED TILL 2022 JUNE 30 SS
ESIC: ఈఎస్ఐ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ బెనిఫిట్ పొందండి ఇలా
ESIC: ఈఎస్ఐ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ బెనిఫిట్ పొందండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Atal Bimit Vyakti Kalyan Yojana | కరోనా సంక్షోభ కాలంలో (Covid 19 Crisis) ఉద్యోగం పోయిందా? ఈఎస్ఐ స్కీమ్‌లో (ESI Scheme) ఉన్నారా? అయితే ప్రభుత్వం నుంచి సాయం పొందండి ఇలా.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) స్కీమ్‌లో ఉన్నవారికి శుభవార్త. అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం గడువును పొడిగించింది ఈఎస్ఐసీ. కరోనా వైరస్ మహమ్మారి (Covid 19 Crisis) సృష్టించిన సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయినవారిని కేంద్ర ప్రభుత్వం అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం ద్వారా ఆదుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ (abvky claim) పొంఎదేందుకు గడువు 2020 డిసెంబర్ 31న ముగిసింది. దీంతో ఆ తర్వాత ఈ స్కీమ్ గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ గడువు కూడా ముగిసింది. దీంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈసారి ఏకంగా ఒక ఏడాది గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 1 నుంచి 2022 జూన్ 30 వరకు ఈ స్కీమ్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.
అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని 2018 జూలై 1న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈఎస్ఐ సబ్స్క్రైబర్లు ఉద్యోగాలు కోల్పోతే వారిని ఆదుకోవడానికి ఈ స్కీమ్‌ను అందిస్తంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సబ్స్క్రైబర్లు ఉద్యోగం కోల్పోతే ఈ సంస్థ ద్వారా ఆర్థిక సాయం పొందొచ్చు. 90 రోజుల వేనంలో 25 శాతం వేతనం పొందేలా ఈ స్కీమ్ రూపొందించారు. అయితే కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఈ బెనిఫిట్‌ను 50 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు... గతంలో ఉద్యోగం కోల్పోయిన 90 రోజుల తర్వాత క్లెయిమ్ చేయాలన్న నిబంధన ఉండేది. ఈ నిబంధనను 30 రోజులకు తగ్గించింది. అంటే ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఈఎస్ఐసీ చట్టం, 1948 లోని సెక్షన్ 2(9) ప్రకారం జీవితంలో ఒకసారి మాత్రమే ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో 50,000 మందికి పైగా ఉద్యోగులు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందారు.
ఉద్యోగం కోల్పోయిన ఈఎస్ఐ సబ్స్క్రైబర్లు ఈ బెనిఫిట్ పొందేందుకు https://www.esic.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నవారే క్లెయిమ్ పొందడానికి అర్హులు. ఈఎస్ఐలో కంట్రిబ్యూషన్ చేస్తూ ఉండాలి. ఉద్యోగుల బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన 5 రోజుల్లోనే లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.