ESI Scheme: ఈఎస్ఐ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త

ESI: ఈఎస్ఐ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త (ప్రతీకాత్మక చిత్రం)

ESI Scheme | ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ స్కీమ్‌లో ఉన్న మహిళలకు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC నిర్వహిస్తున్న ఈఎస్ఐ స్కీమ్‌లో మీరు ఉన్నారా? అయితే మీకు శుభవార్త. ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్న మహిళలకు మెటర్నిటీ ఖర్చుల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్న మహిళలకు, పురుషులైతే అతని భార్యకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. గతంలో రూ.5,000 ఉన్న మెటర్నిటీ ఖర్చుల్ని కేంద్రం ప్రభుత్వం రూ.7,500 చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల అదనంగా మెటర్నిటీ ఖర్చులు రూ.2,500 రానున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఫీడ్ బ్యాక్ కోరుతూ 30 రోజుల గడువు విధించింది. వేర్వేరు వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత తుది నిర్ణయం ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా అంశంపై మొదట డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేయయడం ఆనవాయితీ.

    New Rules: ఆగస్ట్ 1 నుంచి మారే కొత్త రూల్స్ ఇవే

    Personal Loans: అప్పు కావాలా? తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఈ బ్యాంకులు రెడీ

    ప్రస్తుతం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ (సెంట్రల్) కార్పొరేషన్ నిబంధనలు-1950 లోని రూల్ 56ఏలో 'ఐదు వేల రూపాయలు' అని ఉన్న పదాలను 'ఏడు వేల ఐదువందలు' అని మార్చనుంది. రూల్ 56ఏ ప్రకారం ఈ స్కీమ్‌లో ఉన్న మహిళలకు, పురుషులైతే అతని భార్యకు కు మెటర్నిటీ ఖర్చుల కోసం రూ.5,000 ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఫైనల్ నోటిఫికేషన్ విడుదల కాగానే ఇకపై రూ.7,500 మెటర్నిటీ ఖర్చులు వస్తాయి. అయితే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కింద వైద్య సదుపాయాలు లేని ప్రాంతంలో ఉంటేనే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ఈఎస్ఐ ఆస్పత్రులు అందుబాటులో ఉంటే అక్కడ ఆస్పత్రి సేవలు ఉపయోగించుకోవచ్చు కాబట్టి స్కీమ్ వర్తించదు. ఈ బెనిఫిట్ రెండు డెలివరీలకు మాత్రమే లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: