పెన్షనర్లు క్రమం తప్పకుండా పెన్షన్ అందుకోవాలంటే, ఏటా లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవణ ప్రమాణ పత్రం (Jeevan Praman Patra) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలను ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పర్యవేక్షిస్తుంది. అయితే ఈ విషయంలో ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేస్తూ వస్తోంది. పెన్షనర్ల పనిని సులభం చేసేలా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను (Digital Life Certificate) తీసుకొచ్చింది. తాజాగా పెన్షనర్లు నిర్దిష్ట గడువు అనేది లేకుండా ఎప్పుడైనా ఈ డాక్యుమెంట్‌ను అందించవచ్చని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.
సాధారణంగా పెన్షనర్లు నవంబరు 30లోగా లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయాల్సి ఉంది. అయితే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కింద పెన్షన్ పొందుతున్న వారికి ఈ నియమం వర్తించదని ఈపీఎఫ్‌వో తాజాగా ప్రకటించింది. గతంలో డాక్యుమెంట్‌ను సబ్మిట్ చేసిన తేదీ నుంచి సంవత్సరం పాటు అది చెల్లుబాటు అవుతుందని తమ అఫిషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. ఆ గడువు దాటకుండా మాత్రం సర్టిఫికెట్ సమర్పించాలని కోరింది.
Govt Loan: చిరు వ్యాపారులకు రూ.50,000 వరకు లోన్ ఇస్తున్న మోదీ ప్రభుత్వం
ఈపీఎఫ్ఓ ట్వీట్ ప్రకారం.. EPS-95 కింద ఉన్న పెన్షనర్లు (Pensioners) ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. దీనికి డెడ్ లైన్లు అంటూ ఏమీ లేవు. ఉదాహరణకు పెన్షనర్లు గత సంవత్సరం డిసెంబర్ 31న లైఫ్ సర్టిఫికెట్ సమర్పిస్తే.. ఈ సంవత్సరం కూడా అదే తేదీ లోపు దాన్ని సబ్మిట్ చేయాలి. లేకపోతే 2023 జనవరి నుంచి పెన్షన్ చెల్లింపులు ఆగిపోతాయి. అంటే ఇప్పటికే సమర్పించిన జీవన ప్రమాణ పత్రం.. సబ్మిషన్ తేదీ నుంచి 12 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది.
EPS 1995 అనేది ‘డిఫైన్డ్ కంట్రిబ్యూషన్-డిఫైన్డ్ బెనిఫిట్’ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఉద్యోగుల పెన్షన్ కార్పస్ ఫండ్ ఇది. దీనిలో యజమాని, ప్రభుత్వాల నుంచి డబ్బులు స్కీమ్‌లో చేరతాయి. ఆ మొత్తం నెలకు రూ. 15,000 మించకుండా ఉంటుంది. దీని కోసం వేతనంలో యజమాని 8.33 శాతం, సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఏడాది బడ్జెట్లో కేటాయింపుల ఆధారంగా దాదాపుగా 1.16శాతం జమ చేయాల్సి ఉంటుంది.
Gold Jewellery: పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొంటున్నారా? బిల్లులో ఈ వివరాలు ఉండాలి
ఇంతకుముందు ఈపీఎస్ (EPS) పెన్షనర్లందరూ నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్‌ని సమర్పించాల్సి ఉండేది. దీంతో రద్దీ అధికంగా ఉండేది. పెద్ద క్యూలైన్లతో ఇబ్బందులు పడేవారు. దీంతో ఇప్పుడు డిజిట్లో లైఫ్ సర్టిఫికెట్ (DLC)ని సబ్మిట్ చేసే సౌకర్యం వచ్చింది. అందుకోసం మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. PPO సంఖ్య, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. ఉమంగ్ యాప్, సమీప ఈపీఎఫ్ఓ కార్యాలయం, పెన్షన్ డిస్బర్సింగ్ బ్యాంక్, కామన్ సర్వీస్ సెంటర్ (CSC), ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB), పోస్ట్ ఆఫీస్ (Post Office), పోస్ట్ మ్యాన్ల ద్వారా వీటిని సబ్మిట్ చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Pension Scheme, Pensioners