ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వడ్డీని రెండు వాయిదాల్లో జమ చేస్తారన్న వార్తలొచ్చాయి. అంటే మొత్తం వడ్డీ ఒకేసారి కాకుండా 8.15 శాతం ఒకసారి, మిగతా 0.35 శాతం మరో విడతలో ఖాతాదారుల అకౌంట్లో జమ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సెప్టెంబర్ 9న నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుత పరిణామాలను బట్టి రెండు విడతల్లో కాకుండా ఒకేసారి వడ్డీ జమ చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒకే విడతలో అంటే ఒకేసారి 8.5 శాతం వడ్డీ జమ కానుందని తాజాగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ కానుంది. మరి మీ ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
SBI Alert: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ 5 తప్పులు చేయొద్దు
LPG Cylinder: సామాన్యులకు షాక్... భారీగా పెరిగిన సిలిండర్ ధర
గతంలో రెండు విడతల్లో వడ్డీ జమ చేయాలనుకోవడానికి ఓ కారణం ఉంది. ఈపీఎఫ్ఓ ఈక్విటీ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులకు అప్పట్లో రిటర్న్స్ ఆశించినట్టుగా రాలేదు. అందుకే రెండు విడతల్లో వడ్డీ జమ చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడుల నుంచి అంచనాల కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. ఈపీఎఫ్ఓకు వచ్చిన రిటర్న్స్‌లో ఫిక్స్డ్ పెట్టుబడి మార్గాల ద్వారా 85 శాతం, ఈటీఎఫ్‌ల ద్వారా 15 శాతం రిటర్న్స్ వచ్చాయి. కాబట్టి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒకేసారి వడ్డీ జమ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది. ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ చేసిన తర్వాత కూడా ఈపీఎఫ్ఓ దగ్గర మిగులు ఉండనుంది.
LPG Gas Cylinder: ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా పొందండి ఇలా
Post Office Savings Account: ఖాతాదారులకు అలర్ట్... మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ మారాయి
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈపాటికే వడ్డీ జమ కావాల్సి ఉంది. దీపావళి నాటికి ఖాతాదారుల్లో వడ్డీ జమ అవుతుందని వార్తలొచ్చాయి. కానీ దీపావళి ముగిసి 20 రోజులు గడిచినా ఇంకా వడ్డీ జమ కాలేదు. త్వరలోనే ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ అయ్యే అవకాశముంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 8.65 శాతం వడ్డీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి 15 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, EPFO, Personal Finance