ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్. త్వరలో అకౌంట్‌లోకి వడ్డీ జమ కాబోతోంది. ఐదు కోట్లకు పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO మేలు చేసే నిర్ణయం తీసుకోబోతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ ఇప్పటికీ ఈపీఎఫ్ అకౌంట్లలో జమ కాలేదు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. జూలై చివరి నాటికి ఈపీఎఫ్ అకౌంట్లలో వడ్డీ జమ కానుంది. మరి మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నట్టైతే మీ అకౌంట్‌లో వడ్డీ జమ అయిందో లేదో, బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే కాదు గతంలో కూడా ఈపీఎఫ్ వడ్డీ జమ చేయడంలో ఆలస్యం చేసింది ఈపీఎఫ్ఓ. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీ కోసం ఈపీఎఫ్ ఖాతాదారులు 10 నెలల పాటు వేచిచూడాల్సి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని జూలై చివరి నాటికి జమ చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని నిర్ణయిస్తూ మార్చిలో ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడేళ్లతో పోలిస్తే ఇదే తక్కువ వడ్డీ.
Aadhaar: ఆధార్ వెరిఫికేషన్ కోసం కొత్త సర్వీస్... ఇలా వాడుకోండి
EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాదారులు కరోనాతో చనిపోతే క్లెయిమ్ కోసం దరఖాస్తు విధానం ఇదే
మరోవైపు గతేడాది నుంచి కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటంతో ఈపీఎఫ్ ఖాతాదారులు కోవిడ్ 19 అడ్వాన్స్ తీసుకునేందుకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు గతంలో కోవిడ్ 19 అడ్వాన్స్ తీసుకున్నవారు మరోసారి కూడా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ఛాన్స్ ఇచ్చింది. రెండోసారి కూడా ఈపీఎఫ్ అకౌంట్ నుంచి కోవిడ్ 19 అడ్వాన్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.40 లక్షల వరకు ఇన్స్యూరెన్స్... అప్లై చేయండి ఇలా
SBI ATM PIN: మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు పిన్ గుర్తులేదా? కొత్త పిన్ ఇలా క్రియేట్ చేయండి
ఈపీఎఫ్ ఖాతాదారులు కోవిడ్ 19 అడ్వాన్స్ కింద మూడు నెలల బేసిక్ వేతనం అంటే బేసిక్+డీఏ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతంలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్. అంటే మళ్లీ ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయాల్సిన అవసరం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.