ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. ఈపీఎప్ అకౌంట్ హోల్డర్లు తాము జమ చేసిన మొత్తం నుంచి రూ.1,00,000 మెడికల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కొత్త రూల్స్ అమలు చేసింది. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి అత్యవసర వైద్య చికిత్స, ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.1,00,000 అడ్వాన్స్ వెంటనే పొందొచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు ఆస్పత్రి ఖర్చులు, చికిత్సకు సంబంధించిన ఎస్టిమేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌ను ఈపీఎఫ్ఓ జారీ చేసింది. మెడికల్ అడ్వాన్స్ ఏఏ సందర్భాల్లో తీసుకోవచ్చో ఈ సర్క్యులర్‌లో వివరించారు. కోవిడ్ 19 సంబంధిత చికిత్సలను కూడా ఇందులో చేర్చారు. సెంట్రల్ సర్వీసెస్ మెడికల్ అటెండెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద మెడికల్ అడ్వాన్స్ వర్తిస్తుంది.
IRCTC Contest: రైలులో ప్రయాణిస్తూ రూ.1,00,000 గెలుచుకోండి... ఐఆర్సీటీసీ కాంటెస్ట్ వివరాలివే
SBI New Account: ఎస్బీఐలో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే కస్టమర్లకు ఎక్కువ లాభం
నిబంధనల ప్రకారం పేషెంట్ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్‌లో ఉన్న ఆస్పత్రిలో చేరాలి. ఒకవేళ పేషెంట్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే, మెడికల్ బిల్స్‌ని రీఇంబర్స్ చేసేందుకు సడలింపులు ఇవ్వాలంటూ సంబంధిత అధికారుల్ని కోరొచ్చు. అలాంటి సందర్భంలో ప్రైవేట్ ఆస్పత్రుల అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తారు. ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు అడ్వాన్స్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఆస్పత్రి ఖర్చుల కోసం ఎస్టిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆస్పత్రి వివరాలు, పేషెంట్ వివరాలు ఇవ్వాలి.
SBI New Feature: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్... వెంటనే ఈ ఫీచర్ వాడుకోండి
EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌ను తక్కువ అంచనా వేయొద్దు... కోటీశ్వరులు కావొచ్చు ఇలా
పేషెంట్‌కు లేదా వారి కుటుంబ సభ్యులకు సంబంధిత అధికారులు రూ.1,00,000 వరకు మెడికల్ అడ్వాన్స్ పొందొచ్చు. లేదా ట్రీట్మెంట్ వెంటనే ప్రారంభించేందుకు నేరుగా ఆస్పత్రి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఈ అడ్వాన్స్ ఒక్క రోజులోనే పొందొచ్చు. ఏ రోజు దరఖాస్తు చేస్తే అదే రోజు అడ్వాన్స్ పొందొచ్చు. లేదా దరఖాస్తు చేసిన మరుసటి రోజు అడ్వాన్స్ లభిస్తుంది. ఒకవేళ ఆస్పత్రి ఖర్చులు రూ.1,00,000 కన్నా ఎక్కువైతే ఈపీఎఫ్ విత్‌డ్రా నియమనిబంధనల ప్రకారం అదనపు అడ్వాన్స్ పొందొచ్చు. అదనపు అడ్వాన్స్ పొందడానికి ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన ఎస్టిమేట్ ఇవ్వాల్సి ఉంటుంది. పేషెంట్ డిశ్చార్జ్ కావడానికన్నా ముందే ఈ వివరాలు ఇవ్వాలి.
పేషెంట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 45 రోజుల్లో ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి బిల్లుల్ని సబ్మిట్ చేయాలి. ఈపీఎఫ్ నియమనిబంధనల ప్రకారం ఫైనల్ బిల్ పరిశీలించి మెడికల్ అడ్వాన్స్ అడ్జెస్ట్ చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance