ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి అలర్ట్. ఇప్పటివరకు మీ అకౌంట్లోకి ఈపీఎఫ్ వడ్డీ (EPF Interest) జమ కాలేదా? దీపావళి తర్వాత వడ్డీని ఖాతాదారుల అకౌంట్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జమ చేయనుంది. ఈపీఎఫ్ చందాదారులు తమ పీఎఫ్ డబ్బులకు రావాల్సిన వడ్డీ ఎప్పుడు జమ అవుతుందని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి లోపే వడ్డీ వస్తుందనుకున్నారు. కానీ ఈ నెలాఖరు నాటికి చందాదారుల అందరి ఖాతాల్లో జమ కావచ్చని వార్తలొస్తున్నాయి. కాబట్టి, మీకు ఇప్పటివరకు ఈపీఎఫ్ వడ్డీ రానట్టైతే, దీపావళి ఓసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి.
మొత్తం 6.5 కోట్ల ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు ఉండగా, 15.7 లక్షల కోట్ల ఆస్తుల్ని మేనేజ్ చేస్తోంది ఈపీఎఫ్ఓ. ఈ ఏడాది జూన్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈపీఎఫ్ ఖాతాదారులు తాము జమ చేసిన మొత్తంపై ప్రతీ ఏటా లభించే వడ్డీ ఇది. నాలుగు దశాబ్దాల్లో ఇదే తక్కువ వడ్డీ. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ 8 శాతం ఉండేది. రెండేళ్ల క్రితం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎక్కువగా ఉండేది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 8.5 శాతం వడ్డీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ మాత్రమే ప్రకటించింది ఈపీఎఫ్ఓ.
ఈపీఎఫ్ వడ్డీ జమ చేసినా, స్టేట్మెంట్లో కనిపించట్లేదని ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. దీనిపైనా క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ అవుతోందని, ఒకవేళ వడ్డీ ఖాతాదారుల స్టేట్మెంట్లో కనిపించకపోతే అందుకు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ కారణమని క్లారిటీ ఇచ్చింది. ఈపీఎఫ్ఓ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నందున ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ కనిపించట్లేదని తెలిపింది.
Gold Buying Tips: ధంతేరాస్ రోజు నగలు కొనడానికి టిప్స్... ఇలా చేస్తే మోసపోరు
ఏ ఒక్క సబ్‌స్క్రైబర్ వడ్డీ నష్ట పోవట్లేదని, వారి అకౌంట్లలో వడ్డీ జమ అవుతుందని, సెటిల్మెంట్ కోరుకునే అవుట్గోయింగ్ సబ్స్క్రైబర్లందరికీ, విత్‌డ్రాయల్ చేస్తున్నవారికి వడ్డీతో సహా చెల్లింపులు జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ జమ అయ్యే ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తవుతుంది. మరి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా epfindia.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో e-Passbook పైన క్లిక్ చేయాలి.
Step 3- కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
Step 4- యూఏఎన్ నెంబర్, క్యాప్చా కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
Step 5- లాగిన్ చేసిన తర్వాత పాస్‌బుక్ కనిపిస్తుంది.
Step 6- పాస్‌బుక్ డౌన్లోడ్ చేస్తే అందులో వడ్డీ జమ అయిందో లేదో కనిపిస్తుంది.
New Rules: ఉద్యోగులకు అలర్ట్... ఈ తప్పు చేస్తే పెన్షన్ , గ్రాట్యుటీ రాదు
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్ డౌన్లోడ్ చేయాలి.
Step 2- మీ ఆధార్ నెంబర్ , ఇతర వివరాలతో లాగిన్ కావాలి.
Step 3- లాగిన్ అయిన తర్వాత EPFO సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 4- Employee Centric Services పైన క్లిక్ చేయాలి.
Step 5- View Passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 6- మీ యూఏఎన్ నెంబర్ టైప్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.
Step 7- స్క్రీన్ పైన పాస్‌బుక్ కనిపిస్తుంది.
Step 8- డౌన్లోడ్ చేసి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.
ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మరిన్ని పద్ధతులు ఉన్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి EPFOHO UAN అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. యూఏఎన్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Epf, EPFO, Personal Finance