Home /News /business /

EPFO New Rule: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... ఇక ఏడాదిలో ఎప్పుడైనా...

EPFO New Rule: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... ఇక ఏడాదిలో ఎప్పుడైనా...

EPFO New Rule: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... ఇక ఏడాదిలో ఎప్పుడైనా...
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO New Rule: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... ఇక ఏడాదిలో ఎప్పుడైనా... (ప్రతీకాత్మక చిత్రం)

EPFO New Rule | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మరో ఊరట కల్పించింది. పెన్షనర్లు ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్ (Life Certificate) సబ్మిట్ చేయొచ్చు.

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ (Life Certificate) ఇవ్వడానికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఏడాదిలో ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు. ఎప్పుడు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసినా ఏడాది వేలిడిటీ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్లు పెన్షన్ (Pension) పొందేందుకు తాము జీవించి ఉన్నట్టు ఈపీఎఫ్ఓకు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ ఏటా జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం తప్పనిసరి. ఒకవేళ పెన్షనర్ జీవన ప్రమాణ పత్రం సబ్మిట్ చేయకపోతే పెన్షన్ ఆగిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత వృద్ధులకు పెన్షనే జీవనాధారం కాబట్టి తప్పనిసరిగా పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి.

    ఈపీఎఫ్ఓలో రిజిస్టరైన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995 కింద పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ జీవితాంతం పొందాలంటే ప్రతీ ఏటా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఒకసారి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే ఏడాది వేలిడిటీ ఉంటుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ చివరి తేదీని ఫిక్స్ చేస్తూ ఉంటుంది. అంతలోపు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

    PAN Card Update: పాన్ కార్డుపై ఉన్న ఫోటో నచ్చలేదా? సింపుల్‌గా మార్చేయండి ఇలా


    అయితే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిషన్ విషయంలో పెన్షనర్లకు భారీ ఊరట కల్పించింది ఈపీఎఫ్ఓ. ఇకపై లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీలు ఉండవు. కొత్త రూల్స్ ప్రకారం పెన్షనర్లు ఏడాదిలో ఎప్పుడైనా జీవన ప్రమాణ పత్రం సమర్పించే వెసులుబాటు కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. పెన్షనర్ల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు పెన్షనర్లు 2021 నవంబర్ 24న లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే 2022 నవంబర్ 23 వరకు ఆ సర్టిఫికెట్ చెల్లుతుంది.

    Post Office Franchise: పోస్ట్ ఆఫీస్ ఫ్లాంఛైజ్ తీసుకోవాలా? కేవలం రూ.5,000 చాలు

    పెన్షనర్లు డిజిటల్ పద్ధతుల్లో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయొచ్చు. పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకు, కామన్ సర్వీస్ సెంటర్‌, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, పోస్ట్‌మ్యాన్, ఉమాంగ్ యాప్ ద్వారా, సమీపంలోని ఈపీఎఫ్ఓ ఆఫీసులో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయొచ్చు. ఇందుకోసం పీపీఓ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరి. వీటితో పాటు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి.

    ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) 1995 నవంబర్ 16న ప్రారంభమైంది. ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయిన కంపెనీల్లో పనిచేసేవారందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో యజమాని జమ చేసే వాటాలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్‌లోకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం 1.16 శాతం జమ చేస్తుంది. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ బెనిఫిట్స్ పొందాలంటే కనీసం 10 ఏళ్లు సర్వీసులో ఉండాలి. రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లు. ఈ స్కీమ్ ద్వారా జీవితాంతం పెన్షన్ వస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: EPFO, Pension Scheme, Pensioners, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు