Home /News /business /

GOOD NEWS FOR ELECTRIC BIKE BUYERS ENIGMA LAUNCH CAFE RACER BIKE MK

Enigma Cafe Racer: ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు...140 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ ఇదే...

Enigma Cafe Racer

Enigma Cafe Racer

Enigma Cafe Racer: పెట్రోల్ డీజెల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలవైపు కస్టమర్ల దృష్టి మరలుతోంది. మరోవైపు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగానే మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    Enigma Cafe Racer:  పెట్రోల్ డీజెల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలవైపు కస్టమర్ల దృష్టి మరలుతోంది. మరోవైపు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగానే మార్కెట్లోకి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు వీటి నిర్వహణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా పెట్రోలు ఇంధనం ఖర్చు మిగిలే అవకాశం ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఎనిగ్మా (Enigma) ఆటోమొబైల్స్ భారతదేశంలో 'ఎనిగ్మా కేఫ్ రేసర్'ను (Enigma Café Racer) పేరిట ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.  ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంలోనే రూపొందించబడిన , తయారు చేయబడిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడం విశేషం. ఈ బైక్‌ను ఎర్ల్ గ్రే, మిలిటరీ గ్రీన్, థండర్ వైట్, RMS రెడ్ , లాగ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేసే చాన్స్ ఉంది. దీని ధర , ప్రీ-బుకింగ్‌కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

    Xiaomi 11 Lite NE 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ 4 రోజులే

    Enigma Café Racer: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ

    Enigma Café Racer ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది 72V 50 Ah LifePo4 లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని పొందుపరిచారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ , గరిష్ట వేగం గంటకు 136 కిలోమీటర్లు , ఎలక్ట్రిక్ మోటారుకు 5.6 KW విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తుంది. ఇది కాకుండా, దాని బ్యాటరీ కేవలం 3 గంటల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జ్ కోసం 4 గంటలు పడుతుంది. Enigma Café Racer స్పోక్ వీల్స్ తో వస్తోంది. అంతేకాదు  మూడు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధితో టైర్ వారంటీ లభిస్తోంది. అయితే బ్యాటరీ అపరిమిత కిమీ మైలేజీతో పాటు ఐదు సంవత్సరాల వారంటీతో వస్తుంది.

    iQoo Z3 5G: ఐకూ జెడ్3 స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింపు... లేటెస్ట్ రేట్ ఎంతంటే

    Enigma Café Racer: ప్రీ-బుకింగ్

    Enigma Café Racer మార్కెట్‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే, అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా ముందస్తుగా బుకింగ్స్ చేసుకోవచ్చు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Electric Bikes, Electric Vehicles

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు