TRAI: సెట్ టాప్ బాక్సులు వాడేవారికి త్వరలో శుభవార్త

DTH | మీరు డీటీహెచ్ వాడుతున్నారా? ప్రస్తుతం ఉన్న డీటీహెచ్ ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్‌కు మారాలనుకుంటున్నారా? ట్రాయ్ నుంచి త్వరలో మీకు గుడ్ న్యూస్ రాబోతుంది.

news18-telugu
Updated: April 13, 2020, 11:57 AM IST
TRAI: సెట్ టాప్ బాక్సులు వాడేవారికి త్వరలో శుభవార్త
TRAI: సెట్ టాప్ బాక్సులు వాడేవారికి త్వరలో శుభవార్త (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మొబైల్ యూజర్లు ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్‌కు మారాలంటే ఏం చేస్తారు? మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ-MNP ద్వారా నెంబర్ మార్చకుండా నెట్వర్క్‌ మారుతుంటారు. గతంలో అయితే ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్‌కు మారాలంటే నెంబర్ మార్చాల్సిన పరిస్థితి ఉండేది. కానీ తర్వాత మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ-MNP ప్రారంభించరు. దీంతో యూజర్లు తమ నెంబర్ మార్చాల్సిన అవసరం లేకుండా నెట్వర్క్ సులువుగా మారుతున్నారు. సరిగ్గా ఇలాగే డీటీహెచ్ ఆపరేటర్‌ను కూడా మార్చే అవకాశం లేదా? ప్రస్తుతానికి అయితే లేదు. మీరు ఒక డీటీహెచ్ తీసుకున్నారంటే అదే సెట్ టాప్ బాక్స్ వాడాలి. మరో డీటీహెచ్‌కు మారాలంటే ఇంకో సెట్ టాప్ బాక్స్ తీసుకోవాలి. ప్రస్తుతం ఇదే పద్ధతి ఉంది. దీనికి ఓ పరిష్కారం కనుగొన్నది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI. కస్టమర్లకు ఇచ్చే సెట్ టాప్ బాక్సులు-STBs ఇంటర్‌ఆపరేబుల్‌గా ఉండాలని ట్రాయ్ సూచించింది. అంటే సబ్‌స్క్రైబర్ ఏ డీటీహెచ్ ఆపరేటర్‌ని ఎంచుకున్నా, ఆ సెట్ టాప్ బాక్స్ కేవలం ఆ ఆపరేటర్‌కు మాత్రమే పరిమితం కాకూడదు. ఒకవేళ సబ్‌స్క్రైబర్ డీటీహెచ్ ఆపరేటర్‌ని మార్చాలనుకుంటే సెట్ టాప్ బాక్స్ మార్చాల్సిన అవసరం ఉండకూడదని ట్రాయ్ సూచించింది. ఇందుకు తగ్గట్టుగా సెట్ టాప్ బాక్సుల్ని తయారు చేయాలని సూచించింది.

సెట్ టాప్ బాక్సుల ఇంటర్‌ఆపరేబిలిటీకి వీలు కల్పించేలా ఇండియా శాటిలైట్ టీవీ ఆపరేటర్లు పాటిస్తున్న నియమనిబంధనల్లో సవరణలు అవసరమైతే సవరణలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖను ట్రాయ్ కోరింది. ఇంటర్‌ఆపరేబిలిటీకి వీలు కల్పించే కొత్త సెట్ టాప్ బాక్సులు రావడానికి ఎక్కువ రోజుల సమయం కూడా పట్టదు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ ఎత్తేయగానే ఇంటర్‌ఆపరేబిలిటీ నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వినియోగదారులకు మరింత స్వేచ్ఛ కల్పించాలన్న ఉద్దేశంతో ట్రాయ్ అనేక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త శ్లాబ్స్ ప్రకటించడానికి కారణం కూడా అదే. కొత్త శ్లాబ్స్ ద్వారా వినియోగదారులు తాము చూడాలనుకునే ఛానెళ్లు మాత్రమే ఎంచుకునే అవకాశం లభించింది. త్వరలో సెట్ టాప్ బాక్స్ మార్చాల్సిన అవసరం లేకుండా డీటీహెచ్ ఆపరేటర్‌ను మార్చే అవకాశం రాబోతోంది.

ఇవి కూడా చదవండి:

LIC: కరోనావైరస్ ఎఫెక్ట్... ఎల్ఐసీ నుంచి 5 కీలక ప్రకటనలు

Gold Price: పసిడి ప్రేమికులకు షాక్... రూ.50,000 వైపు పరుగులు తీస్తున్న బంగారం

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు వాయిదా వేస్తున్నారా? ఈ నష్టం తప్పదు
First published: April 13, 2020, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading