పేటీఎం యూజర్లకు శుభవార్త. పేటీఎం సరికొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తోంది. పేటీఎంలో మొబైల్ రీఛార్జ్ చేయడం, పోస్ట్ పెయిడ్ బిల్స్ చెల్లించడం, ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ చేయడం, గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, రైలు టికెట్లు, బస్సు టికెట్లు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం లాంటి అనేక సేవలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రెంట్ పేమెంట్స్ ఫీచర్‌ని రిలీజ్ చేసింది. అంటే అద్దెకు ఉంటున్నవారు ఇంటి యజమాని అకౌంట్‌లోకి అద్దె ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇందులో విశేషం ఏంటంటే... క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. రెంట్ పేమెంట్స్ ఫీచర్ ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రతీ ట్రాన్సాక్షన్‌పై క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. క్రెడిట్ కార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి.
Voter ID Correction: ఓటర్ ఐడీ కార్డులో తప్పులను 5 నిమిషాల్లో సరిచేయండిలా
SBI Flexi Deposit Scheme: ఈ స్కీమ్‌లో కనీసం రూ.500 జమ చేస్తే చాలు... బెనిఫిట్స్ ఇవే
ముందుగా మీ పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.
హోమ్ స్క్రీన్‌పై Recharge & Pay Bills పైన క్లిక్ చేయండి.
అందులో Rent Payment ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, అకౌంట్ హోల్డర్ పేరు ఎంటర్ చేయాలి.
మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ఆప్షనల్.
ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి.
Proceed to Pay పైన క్లిక్ చేయాలి.
తర్వాత క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
క్షణాల్లోనే పేమెంట్ ఓనర్ బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది.
LPG Gas Cylinder Subsidy: మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా? త్వరలో షాక్ తప్పదు
SBI Cheque Book: ఎస్‌బీఐ చెక్ బుక్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండిలా
క్రెడిట్ కార్డుతో పాటు యూపీఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. రెంట్ పేమెంట్ చేయడానికి ఇంటి యజమాని బ్యాంక్ అకౌంట్ వివరాలు మాత్రమే ఎంటర్ చేస్తే చాలు. ఇతర వివరాలు అవసరం లేదు. ఇక మీరు ప్రతీ నెల చెల్లించిన ఇంటి అద్దెను ట్రాక్ చేయొచ్చు. 2021 మార్చి నాటికి రూ.300 కోట్లు రెంట్ పేమెంట్స్ చేస్తారని పేటీఎం అంచనా వేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.