Home /News /business /

GOOD NEWS FOR COMPANIES THERE IS NO PRICE INCREASE NOW THE PRICES WILL BE REDUCED ON THESE THEY ARE THESE UMG GH

Price Hikes: కంపెనీల గుడ్ న్యూస్.. ధరల పెరుగుదల ఇప్పట్లో లేనట్టే.. వీటిపై తగ్గనున్న ధరలు.. అవి ఇవే!

కంపెనీల గుడ్ న్యూస్. ధర పెరుగుదల ఇప్పట్లో లేనట్టే . వీటిపై తగ్గనున్న ధరలు.. అవి ఇవే!

కంపెనీల గుడ్ న్యూస్. ధర పెరుగుదల ఇప్పట్లో లేనట్టే . వీటిపై తగ్గనున్న ధరలు.. అవి ఇవే!

ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్(Consumers) గూడ్స్ కంపెనీలు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ తమ కమోడిటీ ధర(Prices)ల (Commodity Prices)ను పెంచకూడదని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ప్రస్తుతానికి ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం లేదు.

ఇంకా చదవండి ...
దేశంలో పెట్రోల్(Petrol), వంట నూనె, అప్పుడు ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే తదితర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. మళ్లీ ధరలు పెరిగితే పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్(Consumer) గూడ్స్ (Fast Moving Consumer Goods), కన్స్యూమర్ డ్యూరబుల్స్ (Consumer Durables) రంగంలోని చాలా కంపెనీల నుంచి ఒక తీపి కబురు అందింది. ఈ కంపెనీలు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ తమ కమోడిటీ ధరల (Commodity Prices)ను పెంచకూడదని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ప్రస్తుతానికి ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం లేదు. కాగా గత మూడు నెలల్లో రాగి, ఉక్కు, అల్యూమినియం ధరలు వరుసగా 21%, 19%, 36% చొప్పున పెరిగాయి.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ గత వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. "ఇన్‌పుట్ ధరలలో తగ్గుదల 2023 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (H2FY23)లో మార్జిన్ లాభాలను అందిస్తుందని మేం ఆశిస్తున్నాం" అని పేర్కొంది. ఇన్‌పుట్ ధరల సవరణతో ధరలను పెంచాల్సిన అవసరం తగ్గిందని తెలిపింది. గత రెండేళ్లలో చాలా కంపెనీలు ధరలను నిరంతరం పెంచినందున.. ఈ పెంచడం ఇప్పుడు ఆపేస్తే ప్రజలకు కాస్తయినా ఊరట కలుగుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. గత రెండేళ్లలో అన్ని ధరల పెరుగుదల 20% కంటే ఎక్కువగా ఉందని ఐసీఐసీఐ వెల్లడించింది.

ఇదీ చదవండి:  Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !


ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఏకాభిప్రాయ అంచనాల (Consensus Estimates) కంటే వ్యవస్థీకృత సహచరుల (Organised Peers) లాభదాయక మార్జిన్లు అధికంగా ఉంటాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. అయితే డ్యూరబుల్ కంపెనీలతో ఇన్వెంటరీ కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మార్జిన్లు మెరుగుపడకపోవచ్చని ఈ సంస్థ తెలిపింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు దాదాపు మూడు ఏళ్ల గ్యాప్ తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులతో పాటు R&D ఖర్చులను పెంచడం, విభిన్న ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం... చిన్న/అసంఘటిత కంపెనీల నుంచి మార్కెట్ షేర్లను పొందేందుకు కమర్షియల్ స్కీమ్స్, వినియోగదారుల ఆఫర్లను పెంచడంలో పెట్టుబడి పెట్టడం చేయవచ్చని పేర్కొంది.ప్రముఖ ఫుడ్ ఐటమ్స్‌ తయారీ కంపెనీ పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా కూడా వస్తువుల ధరల గురించి మాట్లాడారు. ప్రస్తుతం చాలా వస్తువుల ధరల 15-20% తగ్గినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా మార్జిన్ల లాభాలు తగ్గిన FMCG కంపెనీలకు ధరల తగ్గుదల కొంత ఉపశమనం కలిగించిందన్నారు. చాలా కంపెనీలు ధరల పెంపును ఆపేసి.. దశలవారీగా మాత్రమే ధరలను పెంచుతాయి కాబట్టి, తదుపరి ధరల పెంపు లేదా ప్యాకేజీ బరువు తగ్గించడం ఇప్పట్లో జరగదన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఆందోళనగా రేకెత్తిస్తున్న ప్రస్తుత సమయంలో ధరల స్థిరత్వం పట్టణ, గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడానికి సహాయపడుతుందని మయాంక్ షా అన్నారు. ప్రస్తుతం కన్స్యూమర్ కంపెనీలకు డిమాండ్ బాగా ఉందని.. 2H మార్జిన్ రికవరీకి సర్వం సిద్ధమైనట్లు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. అయితే, యూఎస్ డాలర్ రేటు 5-6% పెరగడంతోపాటు ఇతర వేరియబుల్ పెరిగినందున బ్రాండ్‌లు వాటి లాభాల మార్జిన్‌లలో పెద్దగా తేడాను చూడవని నిపుణులు పేర్కొంటున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Consumer durable loan, Essential commodities, Food prices, Petrol

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు