గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. సబ్సిడీ కూడా అంతంతమాత్రంగానే వస్తోంది. దీంతో సామాన్యులకు గ్యాస్ సిలిండర్ కొనడం భారం అయిపోయింది. ఇలాంటి టైమ్‌లో పేటీఎం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇలా ఒక్కసారి కాదు... వరుసగా మూడు నెలలు రూ.900 చొప్పున క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మొత్తం రూ.2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. '3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్' పేరుతో ఈ ఆఫర్ ప్రకటించింది పేటీఎం. ఈ ఆఫర్‌లో భాగంగా కొత్త యూజర్లు గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మూడు నెలల పాటు రూ.900 చొప్పున క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ యూజర్లు ఈ ఆఫర్ పొందొచ్చు.
Indigo Airfare Sale: రూ.915 ధరకే ఫ్లైట్ టికెట్... ఇండిగో ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్
Jio Recharge: జియో రీఛార్జ్ చేస్తే క్యాష్‌బ్యాక్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రూ.900 క్యాష్‌బ్యాక్ పొందడం మాత్రమే కాదు... డబ్బులు లేకపోయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. తర్వాతి నెలలో గ్యాస్ సిలిండర్ డబ్బులు చెల్లించొచ్చు. పేటీఎం అందిస్తున్న పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆఫర్ ద్వారా ఇది సాధ్యం. అంటే పేటీఎం పోస్ట్‌పెయిడ్ ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఇప్పుడు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వచ్చే నెలలో చెల్లిస్తే సరిపోతుంది. ఇక ప్రస్తుత యూజర్లు ప్రతీ బుకింగ్‌పై 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్స్, రివార్డ్ పొందొచ్చు. వీటిని ప్రముఖ బ్రాండ్స్ అందించే అద్భుతమైన డీల్స్, గిఫ్ట్ వోచర్స్‌కు రీడీమ్ చేయొచ్చు. ఇక ఇటీవల పేటీఎం సరికొత్త ఫీచర్స్‌తో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచింది. యూజర్లు సిలిండర్ బుక్ చేసిన తర్వాత ట్రాకింగ్ కూడా చేయొచ్చు. దీంతోపాటు మీ గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయాలంటూ పేటీఎం రిమైండర్స్ కూడా పంపిస్తుంది.
Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఈ రెండు సేవలు లభించవు
UMANG App: పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలా? ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయండి
పేటీఎం యాప్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ముందుగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్‌లో Book Gas Cylinder ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెర్చ్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. ఓసారి వివరాలు కన్ఫామ్ చేసుకొని బుకింగ్ పైన క్లిక్ చేయాలి. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Gas, HP gas, Indane Gas, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price, Paytm