కెనరా బ్యాంక్ (Canara Bank) కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ఈ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యాంకు కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే రీ-కేవైసీ (Re-KYC) పూర్తి చేసే అవకాశం కల్పిచింది. కస్టమర్లు SMS లేదా ఈమెయిల్ ద్వారా రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చని కెనరా బ్యాంక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో కస్టమర్లు కొన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కొందరి అడ్రస్, ఇతర వివరాలు మారే అవకాశం ఉంది.
ఇలాంటి కస్టమర్లను సంప్రదించాలంటే బ్యాంకులకు సమస్యలు తలెత్తుతాయి. అందుకే బ్యాంకులు కస్టమర్ల వివరాలు అప్‌డేట్ అయి ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవడానికి, వివరాలను అప్‌డేట్ చేయడానికి రీ-కేవైసీ సూచిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మార్గదర్శకాల ప్రకారం రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో బ్యాంకులు ఈ ప్రక్రియను చేపడుతాయి.
Post Office Account: పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందా? ఈ కొత్త సర్వీస్ మీకోసమే
If your Re-KYC is due, it can also be done through SMS and Email. Enjoy uninterrupted services. T&Cs apply. #CanaraBank #BankingAtEase pic.twitter.com/OeuTAUMSzq
— Canara Bank (@canarabank) October 27, 2022
కస్టమర్ తమ వ్యక్తిగత సమాచారంతో రీ-కేవైసీ ఫారమ్‌ను పూరించాలి. కస్టమర్ సెల్ఫ్ అటెస్టెడ్ ఐడెంటిటీ, రెసిడెన్షియల్ ప్రూఫ్ కాపీలను రీ-కేవైసీ ఫారమ్‌తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు, KYC ఫారమ్‌ల సమర్పణను బ్యాంక్ శాఖను సంప్రదించి భౌతికంగా అందజేయవచ్చు. లేదా డాక్యుమెంట్లను స్కాన్ చేసి నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. డాక్యుమెంట్లు, ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, బ్యాంక్ రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. జాయింట్ అకౌంట్ హోల్డర్ల విషయంలో ప్రతి ఒక్క కస్టమర్ రీ-కేవైసీ డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
బ్యాంకు అకౌంట్‌తో లింక్ చేసిన కస్టమర్ ఈమెయిల్ ఐడీ ద్వారా రీ-కేవైసీని పూర్తి చేయవచ్చు. ఇందుకు REKYC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కస్టమర్ ఐడీని సబ్జెక్ట్‌గా rekyc@canarabank.comకి మెయిల్ పంపాలి. మెసేజ్ ద్వారా అయితే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి రీ-కేవైసీ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి REKYC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కస్టమర్ IDని టైప్ చేసి 56161కి సెండ్ చేయాలి.
Aadhaar Card: ఆధార్ కార్డ్ మోసాలతో జాగ్రత్త... ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి
ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్యంలోని కెనరా బ్యాంక్ నికర లాభం 89 శాతం పెరిగి రూ.2,525 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ రూ.1,333 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాలంలో రూ.21,331.49 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ.24,932.19 కోట్లకు పెరిగిందని కెనరా బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(NPA) 2022 సెప్టెంబర్ 30 నాటికి గ్రాస్ అడ్వాన్సెస్ 6.37 శాతానికి తగ్గాయి. 2021 సెప్టెంబర్ చివరి నాటికి ఇది 8.42 శాతంగా ఉంది. నెట్ NPA కూడా 2021 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 3.22 శాతం నుంచి 2.19 శాతానికి పడిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Banking, Banking news, Canara Bank, Personal Finance