కేబుల్ టీవీ ఉన్నవారికి శుభవార్త. కేబుల్ ఛార్జీలను భారీగా తగ్గించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI. న్యూ ఇయర్ రోజున ఈ శుభవార్త చెప్పింది. సవరణలతో కొత్త టారిఫ్‌ను ప్రకటించింది. గతంలో రూ.130 + 18శాతం జీఎస్టీ కలిపి రూ.154 చెల్లించినవారికి 100 ఛానెల్స్ ఉచితంగా వచ్చేవి. అదనంగా ప్రతీ 25 ఛానెళ్లకు రూ.20 చెల్లించాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం జీఎస్టీతో కలిపి రూ.154 చెల్లించిన వారికి 200 ఛానెల్స్ లభించనున్నాయి. వీటితో పాటు 26 దూరదర్శన్ ఛానెల్స్ కూడా చూడొచ్చు. మార్చి 1 నుంచి ఈ కొత్త టారిఫ్ అమలులోకి రానుంది. అంతేకాదు... ఒకే ఇంట్లో రెండు టీవీలు ఉంటే రెండో కనెక్షన్‌కు నెట్వర్క్ కెపాసిటీ ఫీజులో గరిష్టంగా 40% చెల్లిస్తే చాలు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ లాంగ్ టర్మ్ సబ్స్క్రిప్షన్స్ తీసుకునేవారికి డిస్కౌంట్లు కూడా ఇవ్వొచ్చని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లకు అనుమతి ఇచ్చింది ట్రాయ్. మరోవైపు బ్రాడ్క్యాస్టర్లు అందించే ఛానెళ్ల బొకేలో ఒక ఛానెల్ ధర గరిష్టంగా రూ.12 మాత్రమే ఉండాలని ట్రాయ్ ఆదేశించింది. బ్రాడ్క్యాస్టర్లు రివైజ్ చేసిన అలా కార్టే టారిఫ్‌ను 2020 జనవరి 15 లోగా తమతమ వెబ్సైట్లలో పబ్లిష్ చేయాలని కోరింది.
గతేడాది ట్రాయ్ కొత్త టారిఫ్ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో యూజర్లపై భారం పడింది. ట్రాయ్ పైన విమర్శలు కూడా వచ్చాయి. వినియోగదారులకు ఛానెళ్లను ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చేందుకే కొత్త టారిఫ్ అమలు చేశామని ట్రాయ్ చెప్పినా... చివరికొచ్చేసరికి కొత్త టారిఫ్ విధానం భారంగా మారింది. దీంతో ట్రాయ్ పలు సవరణలు చేస్తోంది. అందులో భాగంగానే రూ.130 చెల్లించేవారికి 200 ఛానెల్స్ ఇవ్వాలని ఆదేశించింది. మార్చి 1 నుంచి రూ.130+జీఎస్టీ చెల్లించే కేబుల్ టీవీ యూజర్లు 200 ఛానెల్స్ చూడొచ్చు. అన్ని ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్ చూడాలనుకునేవారు గరిష్టంగా రూ.160 చెల్లిస్తే చాలు.
రూ.8,199 ధరకే నోకియా 2.3 సేల్... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Sankranti Special Trains: సంక్రాంతి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, రూట్ల వివరాలివే...
Train Ticket: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ యాప్‌లో ఈజీగా టికెట్లు తీసుకోవచ్చు
ATM: ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.