హోమ్ /వార్తలు /బిజినెస్ /

ECLGS స్కీమ్ గడువు మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వం... రుణాలకు అప్లై చేయండి ఇలా

ECLGS స్కీమ్ గడువు మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వం... రుణాలకు అప్లై చేయండి ఇలా

ECLGS స్కీమ్ గడువు మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వం... రుణాలకు అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

ECLGS స్కీమ్ గడువు మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వం... రుణాలకు అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Emergency Credit Line Guarantee Scheme | కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్-ECLGS గడువు పొడిగించింది. గైడ్‌లైన్స్ కూడా సవరించింది.

వ్యాపారాల కోసం రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు తిరిగి పుంజుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్-ECLGS 1.0, 2.0 ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేయాల్సిన గడువు 2021 మార్చి 31న ముగుస్తుందని ముందే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గడువు ముగియడంతో ఈ పథకాన్ని పొడిగించింది. ECLGS 1.0, ECLGS 2.0 పథకాల గడువును 2021 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు కొత్తగా ECLGS 3.0 కూడా ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం, లీజర్ అండ్ స్పోర్టింగ్ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నవారికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక విండోనో ఓపెన్ చేసింది.

ప్రస్తుతం ECLGS 1.0, ECLGS 2.0, ECLGS 3.0 స్కీమ్స్ ద్వారా రుణాల కోసం వ్యాపారులు దరఖాస్తు చేయొచ్చు. ఈ మూడు స్కీమ్స్‌కు అప్లై చేయడానికి 2021 జూన్ 30 వరకు గడువుంది. ఈ మూడు స్కీమ్స్ ద్వారా రూ.3,00,000 కోట్లు రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ గడువు లోగా లక్ష్యాన్ని చేరుకుంటే అప్లికేషన్ విండో క్లోజ్ అవుతుంది. కాబట్టి వ్యాపారాల కోసం రుణాలు తీసుకోవాలనుకునేవారు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది. రుణాలు మంజూరైన వారికి 2021 సెప్టెంబర్ 30 లోగా డబ్బులు అకౌంట్‌లోకి వస్తాయి.

PAN Aadhaar Link Status: మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా? ఒక్క నిమిషంలో తెలుసుకోండిలా

SBI Scheme: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఈ స్కీమ్ గడువు పెంపు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్-ECLGS కూడా ఒకటి. వ్యాపారులు తమ బిజినెస్‌ను తిరిగి పుంజుకునేలా చేసేందుకు ఈ రుణాలు తీసుకోవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటే 9.25 శాతం వడ్డీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ తీసుకుంటే 14 శాతం వడ్డీ చెల్లించాలి. లోన్ తీసుకున్నవారికి ఒకట్రెండేళ్లు మారటోరియం పీరియడ్ ఉంటుంది. అంటే మారటోరియం కాలంలో రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత లోన్ చెల్లించాలి.

e-PAN Card: పాన్ కార్డ్ లేదా? 10 నిమిషాల్లో ఇ-పాన్ కార్డ్ తీసుకోండి ఇలా

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు


ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా సవరించింది కేంద్ర ప్రభుత్వం. సవరించిన గైడ్‌లైన్స్‌ను నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్-NCGTC విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సవరించిన గైడ్‌లైన్స్ చూడొచ్చు.

First published:

Tags: Bank, Bank loans, Banking, Banks, Business, Business Ideas, BUSINESS NEWS, Online business, Personal Loan, Small business

ఉత్తమ కథలు